Supreme Court: లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజులలోపు సంబంధిత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయాలని చెప్పారు.

Supreme Court: లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court

పేపర్ బ్యాలెట్లతో ఎన్నికల నిర్వహణ, 100 శాతం వీవీపాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల తర్వాత 45 రోజులపాటు వీవీపాట్ యంత్రాలను భద్రపరచాలని చెప్పింది. ఈవీఎం-వీవీప్యాట్‌లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది.

స్వల్ప మార్పులతో విడివిడిగా తీర్పు ఇచ్చారు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా. ఇద్దరు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు ఇచ్చారు. ప్రోటోకాల్‌లతో పాటు సాంకేతిక అంశాలను విపులంగా చర్చించామని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.

వీవీపాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లు తిరస్కరించామని స్పష్టం చేశారు. సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక దశలో సింబల్ లోడింగ్ యూనిట్‌ను సీల్ చేయాలని చెప్పారు. ఎస్ఎల్‌యూను కనీసం 45 రోజుల పాటు నిల్వ చేయాలని తెలిపారు. అభ్యర్థుల అభ్యర్థనలపై ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేస్తుందన్నారు.

ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజులలోపు సంబంధిత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయాలని చెప్పారు. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే… ఖర్చులు తిరిగి ఇవ్వాలని అన్నారు. కాగా, వీవీపాట్ పేపర్ స్లిప్‌లను మాన్యువల్‌గా లెక్కించడం శ్రమ, చాలా సమయంతో కూడుకున్నదని, అంతేగాక మానవ తప్పిదాలకు కూడా అవకాశం ఉంటుందని వాదించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Also Read: రాజీనామా లేఖతో గన్‌పార్కుకు హరీశ్ రావు