Mumbai : మమ్మీ అంటూ ఆర్తనాదాలు.. అందరూ చూస్తుండగానే అలల్లో కొట్టుకుపోయి.. విషాద యాత్రగా విహార యాత్ర

ఒక కుటుంబం ఎంతో సంతోషంగా బీచ్‌కి పిక్నిక్‌కి వెళ్లింది. సముద్రపు అలల్లో సరదాగా గడుపుతున్నారు. ఫోటోలు దిగుతున్నారు. అంతలో ఓ భారీ అల ఆ కుటుంబంలోని మహిళను లాక్కెళ్లిపోయింది. విషాదాన్ని మిగిల్చింది.

Mumbai Beach Tragedy

Mumbai Tragedy : బీచ్‌లు, నదుల వద్ద ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే కొన్ని వీడియోలు మనల్ని అలెర్ట్ చేస్తూనే ఉంటాయి. అజాగ్రత్తతో, ఆకతాయితనంతో చేసే కొన్ని పనులు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న కొన్ని సంఘటనలు చూస్తూనే ఉన్నాము. బీచ్‌లో భారీ అలల మధ్య ఫోటోలు తీయించుకుంటున్న ఓ జంటలో మహిళ కొట్టుకుపోయింది. విగత జీవిగా తిరిగొచ్చింది. ఓ కుటుంబం విహార యాత్ర విషాద యాత్రగా మారిపోయింది.

Mumbai : ముంబయిలో భారీగా క్యూ కట్టిన ప్రజలు .. దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ముంబయిలో బాంద్రాలోని బ్యాండ్ స్టాండ్ ప్రాంతం..ఓ కుటుంబం పిక్నిక్‌కి వచ్చింది. ముందుగా జుహు చౌపటీ వెళ్లాలనుకున్నారు. అయితే అక్కడ భారీ అలలతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అధికారులు బీచ్‌లో ఆంక్షలు విధించారు. ఇక ఈ ఫ్యామిలీ అంతా బాంద్రా వచ్చింది. వస్తూనే ఫ్యామిలీ మొత్తం ఫోటోలు దిగడానికి సముద్రం దగ్గరకి వెళ్లారు. జ్యోతి, ముకేష్ దంపతులు ఓ బండరాయిపై కూర్చున్నారు. పిల్లలు వారికి ఫోటోలు తీస్తున్నారు. అకస్మాత్తుగా భారీ అల ఆ దంపతుల్ని చుట్టుముట్టింది. అంతే.. జ్యోతిని లాక్కెళ్లిపోయింది.

Mumbai Local Train : ముంబయి లోకల్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు

వీడియో తీస్తున్న పిల్లలు మమ్మీ.. మమ్మీ అని ఆర్తనాదాలు చేయడం.. కొన్ని సెకండ్లలోనే జ్యోతి నీటిలో కొట్టుపోవడం జరిగిపోయింది. ఆమెను కాపాడటానికి ఉకేష్ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆమె భర్త ముకేష్‌ను మాత్రం కాలుపట్టుకుని లాగి కాపాడగలిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాంద్రా కోట వద్ద మునిగిన ఆమె కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. చివరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది. కట్టుకున్న భార్య కళ్లముందే చనిపోవడం అతని భర్త, పిల్లలు తట్టుకోలేకపోయారు. భారీ అలలు ఆమెను పొట్టన పెట్టుకుని ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చాయి. ఈ ఉదంతం మరోసారి అజాగ్రత్తగా ఉండొద్దని సూచిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు