Weight Loss : 30 నిమిషాల్లో 500 కేలరీలు బర్న్ చేయడానికి అద్భుత వ్యాయామాలు

వ్యాయామం. శరీరం ఆరోగ్యం ఉండటానికి చాలా అవసరం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చాలా అవసరం. శరీరంలో కేలరీలు కరిగించుకోవటానికి చక్కటి వ్యాయామాలు మీకోసం..

వ్యాయామం చేసినా శరీరంలో ఉండే కేలరీలు కరగటంలేదా. బరువు తగ్గటంలేదా? అయితే ఈ వ్యాయామాలుచేయండి..చక్కగా బరువు తగ్గండి అని సూచిస్తున్నారు నిపుణులు. 30 నిమిషాల పాటు ఈ వ్యాయామాలు చేస్తే 500 కేలరీలను బర్న్ చేయవచ్చంటున్నారు నిపుణులు.

పరుగు..నడక
రోజుకు 30నిమిషాలు పరుగు పెడితే 500 కేలరీలు కరిగిపోతాయి. పరుగు శరీరానికి చాలా చక్కటి వ్యాయామం.30 నిమిషాల పాటు పరుగు వేరు వేరు వేగాలతో పరుగు పెట్టాలి. లేదా ట్రెడ్ మిల్ పై కూడా పరుగు పెట్టవచ్చు.కాస్త స్పీడ్ సెట్ చేసుకుని. అదే పరుగు పెట్టటం ఇబ్బందిగా ఉన్నా..లేదా ఇష్టం లేకపోయినా నడక ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు. వాకింగ్ వల్ల శరీరం అంతా ఉత్తేజంగా మారుతుంది. శరీరంలో కేలరీలు కరగటమే కాకుండా చక్కటి ఉత్సాహాన్నిస్తుంది వాకింగ్.

మెట్ల వ్యాయామం..
అపార్ట్ మెంట్ కల్చర్ పెరుగుతోంది. అపార్ట్ మెంట్ల లిఫ్టులు ఉండటంతో మెట్ల వెంట నడకుండా ఈజీగా లిఫ్ట్ ఎక్కి వెళ్లిపోతున్నాం. కానీ మెట్లు ఎక్కితే శరీరంలో కేలరీలు కరిగిపోతాయి. చక్కటి వ్యాయామం కూడా. మెట్లు ఎక్కటం వల్ల ఒకేసారి అనేక కండరాలు కదులుతాయి. కేలరీలను బర్న్ చేయడానికి లిఫ్ట్ ఎక్కటం మానివేసి మెట్లు ఎక్కటం అలవాటు చేసుకోండి. చక్కగా కేలరీలు కరిగించుకోండి.

ప్లైయోమెట్రిక్ వ్యాయామాలు

ప్లైయోమెట్రిక్ వ్యాయామాలు కేలరీలన కరిగించుకోవటానికే కాదు కండరాలను బలంగా చేసుకోవటానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్లైయోమెట్రిక్‌లను జంప్ ట్రైనింగ్ అంటారు. ఉదాహరణకు: బర్పీలు, జంపింగ్‌తో స్క్వాట్‌లు, 180 డిగ్రీలు దూకడం, తాడును దూకడం, ప్లాట్‌ఫాంపై దూకడంలాంటివి. అంటే శరీరానికి ఒత్తిడి కలిగించేవి. వీలైనంత వేగంగా వీటిని చేయాలి. మోకాలు, స్క్వాట్స్, పుష్-అప్‌లు, ప్రత్యామ్నాయ లంగ్స్, బట్ కిక్స్, లెగ్ రైజెస్ వంటి వ్యాయామాలు చేయవచ్చు. ప్రతి వ్యాయామం 10 నుంచి 12సార్లు చేయాలి. అలాచేస్తే..కండరాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

క్రాస్ చాప్స్..
రెండు చేతులలో బరువుగా బంతి లేదా డంబెల్స్ పట్టుకుని మీ పాదాలను తుంటి వెడల్పుతో నిలబెట్టండి. ఇప్పుడు..మోకాళ్లను వంచి..పాదాలను ఎడమ వైపుకు తిప్పండి. బంతిని ఎడమ షిన్ వైపు తగ్గించండి. ఇప్పుడు మీ కాలును నిఠారుగా చేసి, బంతిని తలపై పైకి లేపి కుడి వైపుకు తిప్పండి. అలా 30నిమిషాలపాటు 10 సార్లు చేయాలి.

పుష్-అప్‌లు
పుష్-అప్‌లు కంటే కాస్త భిన్నంగా చేయాలి. మోకరిల్లే పొజిషన్ లా ఉండి. మీ చేతుల మీదుగా ముందుకు వచ్చేలా చేయండి. మీరు క్రమంగా మీ శరీరాన్ని పుష్-అప్ స్థితికి తగ్గించి, మళ్లీ మోకరిల్లాలి. అలా 8 సార్లు చేయండి.

శరీరాన్ని వంతెనలా చేసే వ్యాయామం

సింగిల్ లెగ్ వంతెన వ్యాయామం గ్లూటెస్ (బట్) కండరాలు మరియు హామ్ స్ట్రింగ్స్ను (పై కాలి వెనుకకు ) వేరుచేసి బలోపేతం చేయడానికి ఒక గొప్ప మార్గం. ఉదర కండరాలను బలోపేతం చేయడం,వెన్నెముకను బలోపేతం చేయడాన్ని వంతెన వ్యాయామం అంటారు. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా నేలపై సాఫీగా పడుకోవాలి. తల నుంచి భుజాల వరకూ అలాగే ఉంచి నడుముని గాల్లోకి ఎత్తాలి. సాధ్యమైనంత వరకూ ఎత్తి చేతులతో కాళ్లను పట్టుకోవాలి. అలా నడుముని వీలైనంత ఎత్తుకు ఎత్తండి. కొన్ని సెకన్లపాటు అలాగే ఉంచి (సాధ్యమైనంత వరకు) ఉండి ఆ తరువాత శరీరాన్ని నెమ్మదిగా క్రిందికి దించాలి.

 

ట్రెండింగ్ వార్తలు