WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ కాంటాక్టులకు మీ ప్రొఫైల్ హైడ్ చేయొచ్చు!

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది.

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది అదే.. లాస్ట్ సీన్ హైడ్ (Last Hide Seen). ఈ ఫీచర్ ఏంటంటే.. మీకు నచ్చిన యూజర్ కాంటాక్టులను మాత్రమే సెలెక్ట్ చేసి హైడ్ చేయొచ్చు. వారికి మాత్రం మీ ప్రొఫైల్ లాస్ట్ సీన్ ఆప్షన్ కనిపించకుండా చేయొచ్చు. చాలా నెలలుగా టెస్టింగ్ చేసిన తర్వాత.. WhatsApp ఎట్టకేలకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

WhatsApp కొత్త ఫీచర్ అప్‌డేట్‌ ద్వారా యూజర్లు తమ చివరిసారి చూసిన స్టేటస్ అప్‌డేట్‌లను తమకు నచ్చని యూజర్లకు కనిపించకుండా హైడ్ చేయవచ్చు. వాట్సాప్ ట్విట్టర్‌లో ఈ ఫీచర్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ‘మీ ప్రైవసీ ఆన్‌లైన్‌లో మరింత ప్రొటెక్ట్ చేయడానికి మీ ప్రైవసీ కంట్రోల్ సెట్టింగ్‌లకు కొత్త ఆప్షన్లను రిలీజ్ చేస్తున్నాము. మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి మీ ప్రొఫైల్ ఫోటో, చివరిగా చూసిన స్టేటస్ ఎవరికి కనిపించాలో సెట్ చేసుకోవచ్చు. గతంలో వాట్సాప్ యూజర్లు చివరిగా చూసిన స్టేటస్ అప్‌డేట్స్.. నిర్దిష్ట యూజర్ల నుంచి హైడ్ చేసే అవకాశం లేదు. దాంతో వాట్సాప్ యూజర్లు “Everyone”, “My Contacts” “Nobody” వంటి మూడు ఆప్షన్లు మాత్రమే కలిగి ఉన్నారు. ఇప్పుడు యూజర్లు ‘My Contacts Except ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Whatsapp Now Lets You Hide Last Seen, Status From Select Contacts

మీరు స్టేటస్‌ను పోస్ట్ చేయడానికి ముందు “Everyone” ఎంపికను ఎంచుకుంటే, మీరు చివరిగా చూసిన, Profile Photo, లేదా Status‌ను WhatsApp యూజర్లకు అందుబాటులో ఉంటుంది. మీరు ‘My Contacts’ ఎంచుకుంటే.. మీరు చివరిగా చూసిన ప్రొఫైల్ ఫోటో, లేదా స్టేటస్ మీ అడ్రస్ బుక్ నుంచి మాత్రమే మీ కాంటాక్టులకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా, మీరు ‘My Contacts Except.. మీ చివరిగా చూసిన, ప్రొఫైల్ ఫోటో లేదా Status మీ అడ్రస్ బుక్ నుంచి మీ కాంటాక్టులకు అందుబాటులో ఉంటుంది.

మరోవైపు.. గ్రూప్ కాల్స్ కోసం అనేక ఫీచర్లను రిలీజ్ చేస్తున్నట్లు WhatsApp ప్రకటించింది. యాప్ ఇప్పుడు నిర్దిష్ట వ్యక్తులను కాల్‌లో మ్యూట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. అయితే, మ్యూట్ చేసే రైట్ పాల్గొనే వారందరికీ ఉంటుందా లేదా గ్రూప్ అడ్మిన్‌కు మాత్రమే ఉంటుందా? అనేది అస్పష్టంగా ఉంది. యూజర్లు కాల్ సమయంలో నిర్దిష్ట వ్యక్తులకు కూడా మెసేజ్ పంపగలరు. వాట్సాప్ కొత్త ఇండికేటర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఎక్కువ మంది యూజర్లు కాల్‌లో జాయిన్ అయినప్పుడు సులభంగా చూడగలరు.

Read Also : Whatsapp : వాట్సాప్ గ్రూపు కాల్‌లో హోస్టు.. ఎవరినైనా మ్యూట్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు