Arthritis : ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు చలికాలంలో వీటిన రోజువారి ఆహారంలో చేర్చుకోండి!

చలికాలం శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల ముఖ్యంగా ఎముకలు, కీళ్ల నొప్పులు, కీళ్లు గట్టి పడడం వంటి ఇబ్బంది కలుగుతుంది.

Arthritis : వయసు పెరిగిన వారిలో ఆర్ధరైటిస్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఆర్ధరైటిస్ ఉన్న రోగుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎముకలు, మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఎముక కీళ్లలో యూరిక్ యాసిడ్ అధికమవ్వటం వల్ల అర్ధరైటిస్ సమస్య ఉత్పన్నం అవుతుంది. కీళ్లు గట్టిపడి పోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో నడవలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

చలికాలం శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల ముఖ్యంగా ఎముకలు, కీళ్ల నొప్పులు, కీళ్లు గట్టి పడడం వంటి ఇబ్బంది కలుగుతుంది. ఇతర సీజన్ల కంటే చలికాలంలో తక్కువగా మనుషుల శరీర కదలికలు తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. విటమిన్ డి, విటమిన్ సి మరియు విటమిన్ కె అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మేలుకలుగుతుంది. అలాంటి వాటిలో నారింజ, క్యాబేజీ, బచ్చలి కూర, టమోటాలను తీసుకోవాలి.

అర్ధరైటిస్ రోగులు చలికాలంలో రోజువారిగా ఆహారంలో చేర్చుకోవాల్సిన పదార్ధాలు ;

1. మెంతులు ; కీళ్ల నొప్పుల నుండి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి. మెంతులు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం వల్ల అర్ధరైటీస్ రోగులకు ఉపయోగపడతాయి. మెంతుల్లో ఉండే సంతృప్త, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

2. వెల్లుల్లి ; చలికాలంలో వెల్లుల్లి ఆహారంలో తీసుకోవటం వల్ల అర్ధరైటిస్ సమస్య ఉన్నవారికి మేలు కలుగుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ సమయంలో 2 వెల్లుల్లి రెబ్బలు తినటం కీళ్ల నొప్పులు ఉన్న వారికి మేలు కలిగిస్తుంది.

3. కొత్తిమీర ; కొత్తిమీర ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరను నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చని నీటిని ఉదయం సమయంలో తీసుకోవటం ద్వారా కీళ్లనొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

వీటిలో జోలికి వెళ్లొద్దు ; చలికాలంలో ఆర్ధరైటిస్ రోగులు ఫాస్ట్ ఫుడ్, కాల్చిన ఆహారం, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలలో చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కీళ్ల నొప్పులని మరింత పెంచుతాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఎక్కువ ఉప్పు తీసుకోవడం హానికరం. తీపి పానీయాలకి దూరంగా ఉండాలి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు