Bigg Boss 7 Day 14 : బిగ్‌బాస్‌లో కట్టప్ప ఎవరు? భళ్లాలదేవ ఎవరు?.. మళ్ళీ లేడి కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్..

బాహుబలి టాస్క్ అయిన అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ తెచ్చి ఒక్కొక్కరిగా ప్రిన్స్, రతిక, శోభాశెట్టి, ప్రశాంత్, గౌతమ్ లని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు. శనివారం ఎపిసోడ్ లోనే శివాజీ, అమర్ దీప్ లని సేవ్ చేసిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Day 14 Sunday Weekend Full Episode Details Elimination Day Nagarjuna Bahubali Task

Bigg Boss 7 Day 14 :  బిగ్‌బాస్‌ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. నిన్నటితో రెండు వారాలు పూర్తయింది. శనివారం ఎపిసోడ్ లో అందర్నీ తిట్టేసిన నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో గేమ్స్, టాస్కులతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశాడు. వినాయకచవితి ఉండటంతో గణేష్ పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.

శనివారం శివాజీ పవరాస్త్ర గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే అది తన దగ్గర ఉంచుకోకుండా హాల్ లోనే వదిలేసి వెళ్లడంతో నాగార్జున వచ్చి రావడంతోనే శివాజీ మీద ఫైర్ అయ్యాడు. అది వేరే ఎవరన్నా తీసుకొని ఉండుంటే అది వాళ్ళదయ్యేది అని క్లాస్ పీకాడు శివాజీకి.

అనంతరం బిగ్‌బాస్‌ లో బాహుబలి రాజ్యం అని టాస్క్ పెట్టారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా వేరే కంటెస్టెంట్స్ లో కట్టప్ప ఎవరు? భళ్లాలదేవ ఎవరు చెప్పాలి అని అందరికి టాస్క్ ఇచ్చారు నాగార్జున.

మొదట శోభాశెట్టి.. గౌతమ్ కట్టప్ప అనిఎం ప్రిన్స్ భళ్లాలదేవ అని చెప్పింది.
గౌతమ్.. రతిక కట్టప్ప అని, ప్రిన్స్ భళ్లాలదేవ అని చెప్పాడు.
రతిక.. తేజ కట్టప్ప అని, గౌతమ్ భళ్లాలదేవ అని చెప్పింది.
తేజ.. గౌతమ్ కట్టప్ప అని, శివాజీ భళ్లాలదేవ అని చెప్పాడు.
శివాజీ.. తేజ కట్టప్ప అని, ప్రశాంత్ భళ్లాలదేవ అని చెప్పాడు.
ప్రశాంత్.. తేజ కట్టప్ప అని, శివాజీ భళ్లాలదేవ అని చెప్పాడు.
దామిని.. శుభశ్రీ కట్టప్ప అని, సందీప్ భళ్లాలదేవ అని చెప్పాడు.
సందీప్.. శివాజీ కట్టప్ప అని, శుభశ్రీ భళ్లాలదేవ అని చెప్పాడు.
శుభశ్రీ.. తేజ కట్టప్ప అని, సందీప్ భళ్లాలదేవ అని చెప్పింది.
ప్రియాంక.. శివాజీ కట్టప్ప అని, సందీప్ భళ్లాలదేవ అని చెప్పింది.
ప్రిన్స్.. సందీప్ కట్టప్ప అని, శివాజీ భళ్లాలదేవ అని చెప్పాడు.
అమర్ దీప్.. గౌతమ్ కట్టప్ప అని, సందీప్ భళ్లాలదేవా అని చెప్పాడు.
చివరగా షకీలా.. ప్రిన్స్ కట్టప్ప అని, ప్రశాంత్ భళ్లాలదేవ అని చెప్పింది.

మధ్యమధ్యలో నాగార్జున కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించాడు, డ్యాన్సులు వేయించాడు. ఈ బాహుబలి టాస్క్ అయిన అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ తెచ్చి ఒక్కొక్కరిగా ప్రిన్స్, రతిక, శోభాశెట్టి, ప్రశాంత్, గౌతమ్ లని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు. శనివారం ఎపిసోడ్ లోనే శివాజీ, అమర్ దీప్ లని సేవ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక చివరగా తేజ, షకీలా ఉండగా ఇద్దరికీ ఒక రూంలోకి పంపించారు నాగార్జున. ఆ రూమ్ లో ఎవరి ఫోటో ప్రత్యక్షమైతే వాళ్ళు సేఫ్, మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు. తేజ ఫోటో రావడంతో షకీలా బిగ్‌బాస్‌ హౌస్ నుండి రెండో వారం ఎలిమినేట్ అయింది.

Also Read : Bigg Boss 7 Day 13 : ఈ వారం డేంజర్ లో ఉన్నది ఎవరు? ఇద్దరు కంటెస్టెంట్స్ సేఫ్..

షకీలా వెళ్తూ అందర్నీ ఏడిపించింది. షకీలాని బిగ్‌బాస్‌ ఎక్కువ రోజులు ఉంచుతారు అనుకున్నారు కానీ రెండో వారంలోనే పంపించేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోయారు.

ట్రెండింగ్ వార్తలు