Bigg Boss 7 Day 7 : ఊహించినట్టు తనే మొదటి ఎలిమినేషన్.. సండే హైలెట్స్..

ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Day 7 Sunday Highlights first week elimination Contestants

.Bigg Boss 7 Day 7 : బిగ్‌బాస్ మొదటి వారం పూర్తయింది. వారంలో చివరి రోజు ఆదివారం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా అంటుందని తెలిసిందే. శనివారం ఎపిసోడ్ లో పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్ కి బిగ్‌బాస్ VIP రూమ్ లో ఉండే ఛాన్స్ ఇచ్చాడు. అలాగే ఆదివారం కాబట్టి కంటెస్టెంట్స్ అందరికి ఒక గేమ్ పెట్టాడు నాగార్జున. అమ్మాయిలందరికి గజ్జెలు కట్టుకోమని చెప్పి అబ్బాయిల కళ్ళకి గంతలు కట్టుకొని వాళ్ళని టచ్ చేయాలి. కొంచెంసేపు ఈ ఆట సరదాగా సాగింది.

ఆడించడం అయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు నాగార్జున. ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. మొదట వీరందరికి శవపేటిక లాంటి బాక్సులు ఇచ్చి ఓపెన్ చేయమన్నారు. అందులో పూలు ఉంటే సేఫ్ అయినట్టు, అస్థి పంజరం ఉంటే డేంజర్ లో ఉన్నట్టు అని చెప్పాడు నాగార్జున. ఈ టాస్క్ లో రతిక, శోభా శెట్టి సేవ్ కాగా మిగిలిన వాళ్ళని డేంజర్ జోన్ లో ఉంచారు. అనంతరం మరో దశలో అందర్నీ సేఫ్ చేసి చివరగా ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ ని మిగిల్చారు. వీరిద్దర్నీ ఒక రూమ్ లోకి వెళ్ళమని చెప్పి ఆ రూమ్ లో ఎవరి మీద అయితే రెడ్ స్పాట్ లైట్ పడుతుందో వాళ్ళు ఎలిమినేటి అవుతారు అని చెప్పారు. దీంతో ప్రిన్స్ పై గ్రీన్ లైట్ పడగా కిరణ్ పై రెడ్ లైట్ పడటంతో కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ నుంచి మొదటి కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయింది.

Changure Bangaru Raja : రవితేజ నిర్మిస్తున్న ‘ఛాంగురే బంగారు రాజా’ ట్రైలర్ రిలీజ్..

కిరణ్ వెళ్లిపోతుండటంతో తన ఫ్రెండ్ వెళ్ళిపోతుందని షకీలా ఏడ్చేసింది. ఇక కిరణ్ బయట స్టేజి మీదకు వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడింది. ప్రిన్స్, షకీలా, శివాజీ, శుభశ్రీ మంచి వాళ్ళు అని, ప్రశాంత్ కి ఓవర్ కాన్ఫిడెంట్ అని, రతిక కు యాటిట్యూడ్ అని, శోభాశెట్టి సెల్ఫిష్ అని, టేస్టీ తేజ చాలా కన్నింగ్ అని చెప్పింది. ఇక నేటి ఎపిసోడ్ లో మళ్ళీ నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు