BiggBoss 6 Day 28 : ఆరోహిని పంపించేశారుగా.. ఏడ్చేసిన శ్రీహాన్.. సూర్యతో కేరళకి స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసిన ఆరోహి..

గ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం ఎపిసోడ్ లో కూడా ఎలిమినేషన్ తో పాటు దసరా ఉత్సవాలు ఏర్పాటు చేశారు......

BiggBoss 6 Day 28 :  బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం ఎపిసోడ్ లో కూడా ఎలిమినేషన్ తో పాటు దసరా ఉత్సవాలు ఏర్పాటు చేశారు. శ్రద్దాదాస్ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఇదే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున తన ఘోస్ట్ మూవీ కూడా ప్రమోషన్ చేసుకున్నాడు. హీరోయిన్ సోనాల్ చౌహన్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాసేపు ఎపిసోడ్ లో ఎంటర్టైన్ చేశారు. దసరా సంబరాలు అయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు నాగార్జున. సుదీప, ఆరోహి చివరి వరకు మిగలడంతో తక్కువ ఓట్స్ వచ్చి ఆరోహి ఎలిమినేట్ అయింది అని నాగార్జున రివీల్ చేశారు.

ఇక ఆరోహి స్టేజిమీదకి వచ్చి హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి మాట్లాడింది. దాదాపు అందరి గురించి పాజిటివ్ గానే చెప్పింది. హౌజ్ లోని సభ్యుల గురించి ఆరోహి చెప్తూ.. శ్రీహాన్ అంత మంచివాళ్ళు ఇంకొకరు లేరు, అందుకే ఇప్పటిదాకా నేనెవ్వరికి అన్నం తినిపించలేదు. శ్రీహాన్ కి మాత్రమే తినిపించాను అని చెప్పింది. దీంతో శ్రీహన్ ఎమోషనల్ అయ్యాడు. ఇక కీర్తి అంటే చాలా ఇష్టం అని, తను ఎవరి గురించి చెడుగా చెప్పదని, హౌజ్ లోని వాళ్ళు కీర్తిని బాగా చూసుకోవాలని చెప్పింది.

BiggBoss 6 Day 27 : హౌస్ కంటెస్టెంట్స్ కి టిప్పులిచ్చి మరీ క్లాస్ పీకిన నాగార్జున..

ఇక సూర్య బయటకి వచ్చాక కేరళకి ట్రిప్ వేద్దాం అనుకుంటున్నామని, దానికి టికెట్స్ కూడా బుక్ చేస్తా అని తెలిపింది. రేవంత్ మంచివాడే కానీ ఆవేశం తగ్గించుకుని, తొందరపడకుండా ఆడితే మంచిదంది. బాలాదిత్యకి మంచితనం ఎక్కువ అని చెప్పింది. ఇలా హౌజ్ లో మరికొంతమంది గురించి చెప్పింది. అలాగే ఇక్కడ తనకి మంచి ఫ్యామిలీ దొరికిందని బిగ్‌బాస్ అయిపోయిన తర్వాత అందరం మళ్ళీ కలుస్తామని ఎమోషనల్ అయి వెళ్ళిపోయింది.

ట్రెండింగ్ వార్తలు