BiggBoss 6 Day 80 : బిగ్బాస్ లో గత ఎపిసోడ్ నుంచి కంటెస్టెంట్స్ ఫ్యామిలీలని తీసుకొస్తున్నారు. మంగళవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డి భార్య, కూతురు, రాజ్ తల్లి రాగా బుధవారం ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి సందడి చేశారు. మొదటగా ఫైమా తల్లి షాహీదా వచ్చింది. తల్లిని చూడగానే ఫైమా గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. ఫైమా తల్లి అందరితో సరదాగా గడిపింది. బయట అందరూ తనని ఫైమా వాళ్ల అమ్మ అంటూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆనందపడింది ఫైమా తల్లి.
ఆ తర్వాత శ్రీసత్య తండ్రి, తల్లి వచ్చారు. శ్రీసత్య తల్లి వీల్ చైర్ లో వచ్చింది. తండ్రిని, వీల్చైర్లో ఉన్న తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసి ఇద్దర్ని హగ్ చేసుకుంది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. శ్రీసత్య తండ్రి నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ వెటకారం తగ్గించుకో, సిల్లీ కారణాలతో నామినేషన్స్ వేయకు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయాక తన తల్లికి చికిత్స చేయించడానికి డబ్బులు లేవు అని బాధపడింది.
ఆ తర్వాత రోహిత్ వాళ్ళ అమ్మ వెనక నుంచి వచ్చి రోహిత్ కళ్లు మూసి సర్ప్రైజ్ చేసింది. తల్లిని చూడగానే రోహిత్ ఏడ్చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇటీవలే హౌజ్ నుంచి బయటకి వెళ్లిపోయిన తన భార్యని తలుచుకున్నాడు. మెరీనా తనకోసం పంపిన ఫొటోఫ్రేమ్ చూసి ఏడుస్తూ రిలేషన్లో ఉన్నప్పుడు దిగిన ఫస్ట్ సెల్ఫీ ఇది అని ఎమోషనల్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్స్ ఫ్యామిలీల రాకతో ఎమోషనల్ గా, సరదాగా సాగింది. నేటి ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ రానున్నాయి.
ఇక కంటెస్టెంట్స్ వెళ్లిపోయిన తర్వాత బిగ్బాస్ ఇంటిసభ్యులను ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, లూప్ అనే గేమ్ ఆడించాడు. ఈ గేమ్ లో ఇంటిసభ్యులు ఒకరినొకరు ఆటపట్టించారు. ఈ గేమ్ సరదాగా సాగింది.