ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత..! ఎందుకంటే..

ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందించే సేవలు కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.

Aarogyasri Services : ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రేపటి (మే 22) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనుంది ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. గతేడాది ఆగస్టు నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయినట్లుగా తెలిపింది. దాదాపుగా 1500 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని ఆశా వెల్లడించింది.

530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్ ఎంఎస్ లో అప్ లోడ్ చేసినట్లుగా తెలిపారు. అయితే ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదంటూ స్పష్టం చేశారు. ఇక ఉద్యోగుల ఆరోగ్యం పథకం కింద 50 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు మాత్రమే జరిగాయని ఆశా తెలిపింది. ప్రభుత్వం ఈ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందించే సేవలు కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.

పెండింగ్ బిల్లుల విషయమై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. అయినా రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని లేఖలో వెల్లడించింది. పెండింగ్ బకాయిలను చెల్లించాలంటూ ఆస్పత్రులు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి.

ఇక, ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీ రేట్లను కూడా పెంచాలని కోరుతున్నాయి. సుమారుగా పదేళ్ల కిందటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో ప్యాకేజీ ధరలు పెంచాలని కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయాయి. కాగా, ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తోంది ప్రభుత్వం. ఎంతో మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారు. అయితే, ఇప్పుడీ సేవలు నిలిచిపోవడం ద్వారా వారు తీవ్ర
ఇబ్బందులు పడనున్నారు.

Also Read : ఏపీలో సిట్ వేస్ట్.. జగన్, చంద్రబాబుకు బాధ్యత లేదా? : సీపీఐ నారాయణ

 

ట్రెండింగ్ వార్తలు