AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. పిడుగులు పడే చాన్స్.. వారికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
AP Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
AP Rain Alert
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్
- ఐదు రోజులు దంచికొట్టనున్న వానలు
- పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్
- అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు
AP Rain Alert : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఒకవైపు రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితోపాటు.. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10గంటల తరువాత బయటకు వచ్చేందుకు ప్రజలు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు సైతం నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. ఏపీలో వానలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్.. అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా..? వెంటనే ఇలా చేయండి..
వాతావరణంలో అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో రానున్న ఐదు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలులు ప్రభావంతో ఓవైపు ఎండలు, మరో వైపు ఆకాశం మేఘావృతమై విభిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసిన వివరాల ప్రకారం.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలిపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని, అదే సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఉరుములు, మెరుపుల సమయంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని.. ఆ సమయాల్లో ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఏపీలో ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయం.. ఇలాంటి సమయంలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పొలాల్లో కోత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
