Chiranjeevi : నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తే.. అంతా కలిసి నన్ను బ్యాన్ చేశారు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో భాగంగా ప్రెస్ మీట్ జరగగా గతంలో తన జీవితంలో ఓ జర్నలిస్ట్ తో జరిగిన సంగతి గురించి మాట్లాడారు చిరంజీవి.

Chiranjeevi Sensational Comments Revealed an Incident with a Journalist

Chiranjeevi : తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్(Megastar) చిరంజీవి స్థానం అందరికి తెల్సిందే. సొంతంగా వచ్చి ఎన్నో సినిమాలతో కష్టపడి, ప్రేక్షకులని మెప్పించి పైకి ఎదిగి మెగాస్టార్ గా నిలిచి ఇప్పటికి అదే స్థానంలో కొనసాగుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో 68 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటి హీరోలకు పోటీనిస్తూ అభిమానులు, ప్రేక్షకుల కోసం వరుస సినిమాలు చేస్తున్నారు.

తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో భాగంగా ప్రెస్ మీట్ జరగగా గతంలో తన జీవితంలో ఓ జర్నలిస్ట్ తో జరిగిన సంగతి గురించి మాట్లాడారు చిరంజీవి.

చిరంజీవి మాట్లాడుతూ.. మెకానిక్ అల్లుడు సినిమా షూటింగ్ మధ్యలో నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినా నేను లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. తిరిగి వచ్చాక అప్పుడు ఉన్న సినిమా మ్యాగజైన్స్ సితార, జ్యోతి చిత్ర, శివరంజని.. లాంటివి అన్ని తెప్పించుకొని మన గురించి, సినిమా గురించి ఏమన్నా న్యూస్ వచ్చిందేమో అని చూస్తే ఒక్క న్యూస్ కూడా లేదు. దీంతో నేను ఆశ్చర్యపోయాను దాని గురించి ఆరా తీస్తే. అమెరికాకు వెళ్లే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారికి, నాకు మధ్య ఓ సీన్ అన్నపూర్ణ స్టూడియోలో షూట్ జరుగుతుంది. నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ ఎవరన్నా వస్తే లోపలి రానివ్వద్దు అని అక్కడి వాళ్లకి చెప్పారు. అదే సమయంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను కలవడాన్నికి వస్తే అక్కడ ఉన్న వాచ్ మెన్ లోపలికి పంపించలేదు. ఆ జర్నలిస్ట్ వచ్చినట్టు చెప్పమని చెప్పినా షూట్ అయ్యేదాకా ఎవర్ని పంపించొద్దు అని చెప్పడంతో అతను హర్ట్ అయి వెళ్ళిపోయాడు. దీంతో అతను వేరే జర్నలిస్టులతో కలిసి మాట్లాడి ఇలా నా గురించి, నా సినిమాల గురించి కవర్ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Also Read : Raviteja : టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ.. ఏకంగా 12 కుట్లు..

ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ వచ్చి నాకు చెప్పాక.. ఎవరో వాచ్ మెన్ చేసిన దానికి నన్ను నెగిటివ్ గా తీసుకొని అందరూ కలిసి బ్యాన్ చేయడం సబబేనా అని అడిగాను. నేను వాళ్ళ మ్యాగజైన్స్ కోసం, ప్రతి మ్యాగజైన్ కి సపరేట్ గా స్టిల్స్ ఇచ్చి వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడ్ని. అయినా ఇలా చేయడంతో నాకు బాధ అనిపించింది. ఆ సీనియర్ జర్నలిస్ట్ నాకు సారీ చెప్పినా నేను వద్దు, మీరు అలాగే మీ మాట మీదే ఉండండి అని చెప్పి పంపించాను అని తెలిపారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఇంతకీ ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎవరో మాత్రం చెప్పలేదు.

ట్రెండింగ్ వార్తలు