Vishwak Sen : రీల్స్‌కి అందరూ అడిక్ట్ అయిపోయారు.. సోషల్ మీడియా అడిక్షన్ పై విశ్వక్ సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నే తీసేసాడు.

Vishwak Sen Sensational Comments on Instagram Reels and Social Media Addiction

Vishwak Sen : విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ ఇటీవల దాస్ కా ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో హిట్స్ కొట్టాడు. త్వరలో దీపావళికి మెకానిక్ రాకీ సినిమాతో రాబోతున్నాడు. చేతిలో ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే విశ్వక్ సేన్ ఇటీవల కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తీసేసాడు.

సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నాను అని చెప్పి ఇటీవల కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నే తీసేసాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. సోషల్ మీడియాకు ఎందుకు దూరమయ్యాడో రీజన్ మాత్రం చెప్పలేదు విశ్వక్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ దీని గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై ఆ షోలో పిల్లలతో స్పెషల్ స్కిట్.. ఎమోషనల్ అయిన నిహారిక..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. చిన్న బ్రేక్ తీసుకున్నాను సోషల్ మీడియా నుంచి అంతే. రీల్స్ చూస్తుండటం వల్ల బాగా టైం అయిపోతుంది. నైట్ నిద్ర వస్తున్నా కూడా రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నాను. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అందుకే ఇన్‌స్టాగ్రామ్ తీసేసాను. ఇన్‌స్టాగ్రామ్ తీసేసాక ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా. దీనికి కూడా నాకు మెసేజ్ లు, ఫోన్స్ చేసి ఏమైంది? ఎందుకు తీసెసావు? అని అడుగుతున్నారు. సోషల్ మీడియా లేకుండా ఉంటే అదేదో తప్పు అయినట్టు, మన బాడీ పార్ట్ లేనట్టు చూస్తున్నారు. తింటున్నా, పడుకున్నా, ఏ పని చేసినా ఫోన్ అందరికి అడిక్ట్ అయిపొయింది. ఫ్యామిలీకి, వర్క్ కి.. దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి. ఎంతసేపు ఫోన్ తోనే ఉంటున్నారు. హద్దులు దాటి మరీ ఫోన్ ని లైఫ్ లో భాగం చేసుకుంటున్నారు అందుకే నేను కొన్ని రోజులు దూరంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్ తీసేసాను అని తెలిపాడు.

ఇటీవల చాలా మంది ఆ రీల్స్ మోజులో పడి టైం నిజంగానే వేస్ట్ చేసుకుంటున్నారు. తింటున్నా, పడుకుంటున్నా ఫోన్ పట్టుకొని ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటున్నారు. ఇది మానసిక, శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. విశ్వక్ లాగా ఇన్ స్టాగ్రామ్ తీసేయకపోయినా లిమిట్ గా వాడి సోషల్ మీడియాని మన కంట్రోల్ లో ఉంచుకుంటే చాలు.

ట్రెండింగ్ వార్తలు