Giri Babu : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత..
Actor Giri Babu : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 80 ఏళ్ళ వయసులో గిరిబాబు తుదిశ్వాస విడిచారు.
Senior Actor Giri Babu Passes Away At Age 80
Giri Babu : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు గిరిబాబు కొద్దిసేపటి క్రితమే మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో, వయోభారంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 80 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు.
ప్రకాశం జిల్లా రావినూతల గిరిబాబు సొంతఊరు. సినిమాల మీద మక్కువతో 1973 లో జగమే మాయ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 50 ఏళ్లలో దాదాపు 600కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. దర్శకుడిగా మూడు సినిమాలు, నిర్మాతగా 5 సినిమాలు కూడా చేసారు.
Also Read – Master Bharat : అవన్నీ అబద్దం.. ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్..
గిరిబాబు అసలు పేరు ఎర్రా శేషగిరిరావు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రఘుబాబు కమెడియన్ గా సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రెండో తనయుడు బోసుబాబు కూడా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. గిరిబాబు భార్య శ్రీదేవి 2016లో మరణించారు. గిరిబాబు ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మొదలుకొని నేటి హీరోల వరకు అందరితోనూ కలిసి నటించాడు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
