Gold Silver Prices Today : బంగారం కొనేవారికి బిగ్ అప్డేట్.. ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, ఇవాళ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

Gold Silver Prices Today : గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలో ఇవాళ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సిల్వర్ ధర స్థిరంగా కొనసాగుతోంది.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. అక్కడ ఔన్సు బంగారంపై ఆరు డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,881 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,37,620 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,26,150 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,37,770 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,26,300 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,37,620కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,26,150 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,95,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,95,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,95,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
