Master Bharat : అవన్నీ అబద్దం.. ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మాస్టర్ భరత్..
తాజాగా దీనిపై స్పందిస్తూ మాస్టర్ భరత్ ఓ వీడియో రిలీజ్ చేసారు. (Master Bharat)
Master Bharat
Master Bharat : వెంకీ, ఢీ, రెడీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్.. ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫుల్ గా నవ్వించాడు మాస్టర్ భరత్. దాదాపు 80 సినిమాల్లో భరత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. పెద్దయ్యాక ఫ్రెండ్ పాత్రల్లో ఒకటి రెండు సినిమాల్లో నటించారు. కానీ గత కొన్నాళ్లుగా భరత్ సినీ పరిశ్రమకు దూరంగానే ఉన్నారు.
గత సంవత్సరం భరత్ తల్లి మరణించింది. ఇటీవల భరత్ తల్లి చివరి కోరిక మేరకు భరత్ డాక్టర్ అవ్వాలని, యాక్టింగ్ వదిలేసినట్టు రూమర్స్ వచ్చాయి. తాజాగా దీనిపై స్పందిస్తూ మాస్టర్ భరత్ ఓ వీడియో రిలీజ్ చేసారు.
Also See :Satvika Veeravalli : ఆకాశంలో ఒక తార హీరోయిన్.. సాత్విక వీరవల్లి ఫోటోలు..
భరత్ మాట్లాడుతూ.. మా అమ్మ గారు మరణించినపుడు మీ అందరూ ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు. ఇటీవల నేను కొన్ని రూమర్స్ చూసాను. నేను నటనను దూరం పెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ కావాలని అమ్మ చెప్పిందని, అందుకే నేను ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నానని ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్దం. అమ్మ ఎప్పుడు సినిమాల్లోకి వెళ్లొద్దని చెప్పలేదు. నేను ఏ పని చేసిన ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటుంది. చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నాను. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాను. ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాను. త్వరలో మైత్రీమూవీ మేకర్స్ నుంచి ఓ సినిమా చేస్తున్నాను. హిందీలో కూడా ఒక సినిమా చేస్తున్నాను. నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయి అని తెలిపారు.
