×
Ad

Indra Movie : ఏలూరు ఇంద్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఈ వైరల్ ప్రొడ్యూసర్‌ని గుర్తుపట్టారా? అప్పుడు పిల్లోడు..

చిరంజీవి స్ఫూర్తితోనే ఎంతోమంది సినీ పరిశ్రమకు వచ్చారు.

  • Published On : July 25, 2024 / 08:37 AM IST

Tollywood Producer Shares Old Photo from Indra Success Celebrations in Eluru

Indra Movie : చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీ హిట్స్ లో ఇంద్ర ఒకటి. ఈ సినిమా రిలీజయి నిన్నటికి 22 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మరోసారి ఇంద్ర సినిమాని చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడున్న చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు చిరంజీవి అభిమానులని తెలిసిందే. చిరంజీవి స్ఫూర్తితోనే ఎంతోమంది సినీ పరిశ్రమకు వచ్చారు.

ఇప్పటి సెలబ్రిటీలు అంతా అప్పట్లో చిరంజీవి సినిమాకు థియేటర్స్ లో రచ్చ చేసారు. చిరంజీవి స్పూర్తితో వచ్చి సక్సెస్ అయిన వాళ్ళల్లో నిర్మాత SKN ఒకరు. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ ఫుల్ నిర్మాతగా మారారు. తన సినిమాలతో, స్టేజి మీద తన స్పీచ్ లతో SKN ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాడని తెలిసిందే.

Also Read : Allu Arjun – Sneha : వెకేషన్‌లో బన్నీతో స్పెషల్ సెల్ఫీ దిగిన స్నేహ.. సమంత కామెంట్..

తాజాగా ఇంద్ర సినిమా 22 ఏళ్ళు అయిన సందర్భంగా SKN ఈ పాత స్పెషల్ ఫోటో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసాడు. SKN తన ట్వీట్ లో.. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాకు 22 ఏళ్ళు. నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. ఏలూరులో జరిగిన ఇంద్ర సక్సెస్ మీట్ లో నేను మాట్లాడుతుండగా తీసిన ఫోటో ఇది. ఇంద్ర సినిమా 35 సార్లు చూసాను. అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని పోస్ట్ చేసారు.

ఏలూరులో ఇంద్ర రిలీజయి హిట్ కొట్టిన తర్వాత చిరంజీవి పుట్టిన రోజు నాడు ఇంద్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ జరగ్గా అక్కడ అభిమానిగా SKN మాట్లాడాడు. చిన్నప్పట్నుంచి చిరంజీవి అభిమాని అయిన SKN ఏలూరు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ని కొన్నాళ్ళు నడిపారు. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చేసారు.