Allu Arjun – Sneha : వెకేషన్‌లో బన్నీతో స్పెషల్ సెల్ఫీ దిగిన స్నేహ.. సమంత కామెంట్..

తాజాగా స్నేహ అల్లు అర్జున్ ని కౌగలించుకొని దిగిన సెల్ఫీ పోస్ట్ చేసింది.

Allu Arjun – Sneha : వెకేషన్‌లో బన్నీతో స్పెషల్ సెల్ఫీ దిగిన స్నేహ.. సమంత కామెంట్..

Allu Sneha Reddy Shares Special Selfie with Allu Arjun Photo goes Viral

Updated On : July 25, 2024 / 8:04 AM IST

Allu Arjun – Sneha : ఇటీవల పుష్ప 2 సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి యూరప్ లోని నార్వే దేశానికి వెకేషన్ కి వెళ్ళాడు. బన్నీ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. రెగ్యులర్ గా ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

నార్వే వెకేషన్ నుంచి కూడా స్నేహ ఇప్పటికే పలు ఫోటోలు, అక్కడి ప్రకృతి అందాలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో షేర్ చేసింది. నార్వేలో బాగా ఫేమస్ అయిన పల్పిట్ రాక్ అనే పర్యాటక ప్రాంతంలో భారీ కొండ పైకి ఎక్కి కొండ అంచున ఫ్యామిలీ నలుగురు కలిసి దిగిన ఫోటో కూడా ఇటీవల స్టోరీలో షేర్ చేసింది స్నేహ రెడ్డి.

Also Read : Anasuya : మీ హీరోలాగా ఆడవాళ్ళని తిట్టడం మాత్రమే వచ్చు మీకు.. సోషల్ మీడియాలో మళ్ళీ అనసూయ..

తాజాగా స్నేహ అల్లు అర్జున్ ని కౌగలించుకొని దిగిన సెల్ఫీ పోస్ట్ చేసింది. అల్లు అర్జున్ ఫేస్ కనపడకుండా కౌగిలించుకొని ఉన్న ఫోటో స్నేహ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో వెనక అల్లు అర్హ కూడా ఉంది. దీంతో వెకేషన్ లో బన్నీతో స్నేహ దిగిన ఈ స్పెషల్ సెల్ఫీ వైరల్ గా మారింది. దీనికి అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుండగా సమంత, రకుల్ ప్రీత్ సింగ్ కూడా లవ్ సింబల్స్ తో కామెంట్ చేసారు. నార్వే వెకేషన్ నుంచి స్నేహ ఇంకెన్ని ఫోటోలు షేర్ చేస్తుందో చూడాలి.