Kollywood : తమిళ ఇండస్ట్రీని నమ్ముకొని క్లీన్ బౌల్డ్ అయిన స్టార్‌ క్రికెటర్లు..

తమిళ పరిశ్రమని నమ్ముకొని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ కి తిరిగి వెళ్లిపోతున్నారు.

Dhoni Sreesanth harbhajan singh irfan pathan failed at tamil industry

Kollywood : క్రీడా రంగంలో భారత క్రికెటర్లుగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కొందరు ఆటగాళ్లు.. ఆ తరువాత సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. అయితే వారిలో ఎవరూ సక్సెస్ అయిన వారు లేరు. ఇటీవల భారత మాజీ కెప్టెన్ ధోని (Dhoni) నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడితే.. సదాగోపన్ రమేష్, హర్భజన్ సింగ్, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్ నటులుగా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వీరంతా తమిళ సినిమాలతోనే సినీరంగ ప్రవేశం చేశారు.

Jawan Collections : బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తున్న జవాన్.. మూడు రోజుల్లో..!

తమిళనాడులో క్రికెటర్లకు మంచి క్రేజ్ ఉంటుంది. దీంతో ఆ ఫేమ్ ని ఉపయోగించుకొని సినిమా రంగంలో కూడా రాణించవచ్చు అనుకోని ఎంట్రీ ఇచ్చారు. కానీ వారి ఆలోచన తప్పు అయ్యింది. వెండితెరకు ముందుగా పరిచయం అయిన భారత్ క్రికెటర్.. సదాగోపన్ రమేష్. 24 వన్డేలు, 19 టెస్ట్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సదాగోపన్.. 2011లో తమిళ డైరెక్టర్ యువరాజ్ దయాళన్ తెరకెక్కించిన ‘బొట్ట బొట్టి’ మూవీలో హీరోగా నటించాడు. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో సదాగోపన్ మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు.

Virinchi Varma : లవ్ సినిమాల డైరెక్టర్.. ఇప్పుడు పొలిటికల్ యాక్షన్ డ్రామాతో.. జితేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ విడుదల..

ఆ తరువాత 2021 లో తమిళ్ మూవీ ‘ఫ్రెండ్‌షిప్’తో హర్భజన్ సింగ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా ఆశించిన విజయం అందుకోలేక పోయింది. ఇక 2022 లో ‘కథు వాకిల్ దౌ కాదల్‌’ చిత్రంతో శ్రీశాంత్, ‘కోబ్రా’ మూవీతో ఇర్ఫాన్ పఠాన్.. ముఖ్య పాత్రలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రాలు కూడా ఆకట్టుకోకపోవడంతో అందరూ వెనుదిరిగారు. ఇక ధోని విషయానికి వస్తే.. నటుడిగా కాకుండా నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

హరీష్ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా ధోని తన ప్రొడక్షన్ లో తొలి సినిమాగా ‘LGM’ని తీసుకు వచ్చాడు. తమిళ్ డైరెక్టర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ధోనికి నష్టాలే మిగిల్చింది. అంతేకాదు ఓటీటీకి ఈ సినిమాని ఇవ్వడానికి ధోని తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా తమిళ పరిశ్రమని నమ్ముకున్న ప్రతి క్రికెటర్ క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ కి తిరిగి వెళ్లిపోతున్నారు. మరి ధోని మిగిలిన ఆటగాళ్లులా వెనుదిరిగుతాడా..? లేదా రెండో సినిమాతో ముందుకు వెళ్తాడా..? అనేది చూడాలి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు