Kichcha Sudeepa : కిచ్చ సుదీప్ – విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా సినిమా.. కబ్జా డైరెక్టర్‌తో..

కిచ్చ సుదీప్ హీరోగా కన్నడ ప్రముఖ డైరెక్టర్ R చంద్రు ఈ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Kichcha Sudeepa New Pan India Movie under R Chandru Direction with Vijayendra Prasad Script Supervision

Kichcha Sudeepa : కన్నడ(Kannada) స్టార్ హీరో కిచ్చ సుదీప్ విక్రాంత్ రోనా(Vikranth Rona) సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇటీవలే తన 46వ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఫుల్ మాస్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో చెప్పేశారు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు కిచ్చ సుదీప్. నేడు సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు.

కిచ్చ సుదీప్ హీరోగా కన్నడ ప్రముఖ డైరెక్టర్ R చంద్రు ఈ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. చంద్రు ఇటీవలే ఉపేంద్రతో కబ్జా సినిమాని తెరకెక్కించగా ఇది ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కబ్జా 2 సినిమాని పక్కనపెట్టి ఇప్పుడు సుదీప్ తో సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమాకి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు.

Raviteja Family : ఫ్యామిలీతో రవితేజ జపాన్‌లో సందడి.. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసిన మాస్ మహారాజ..

చంద్రు కథ రాయగా దానిని విజయేంద్రప్రసాద్ మార్పులు చేర్పులు చేసి ఫైనల్ చేస్తారని సమాచారం. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సుదీప్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ ఉండబోతుందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు