Naga Chaitanya : ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నాగచైతన్య కొత్త మూవీ..

అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య మాస్ హీరో ఇమేజ్ కోసం ఎన్నిసారులు ట్రై చేసినా.. అది విఫలమవుతూనే వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఒక మాస్ కమర్షియల్ హిట్ కొట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తమిళ సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి సినిమా చేయబోతున్నాడు. కాగా నేడు ఈ అక్కినేని హీరో పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

Naga Chaitanya : అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య మాస్ హీరో ఇమేజ్ కోసం ఎన్నిసారులు ట్రై చేసినా.. అది విఫలమవుతూనే వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఒక మాస్ కమర్షియల్ హిట్ కొట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తమిళ సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ దర్శకుడు ఇటీవలే టైమ్ లూప్ మూవీ ‘మానాడు’తో మంచి విజయాన్ని అందుకున్నాడు.

Naga Chaitanya : NC22 టైటిల్ రిలీజ్ డేట్‌ని ప్రకటించిన నాగచైతన్య.. ప్రీ లుక్ పోస్టర్ అదుర్స్..

కాగా నేడు ఈ అక్కినేని హీరో పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. నాగచైతన్య 22వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతన్య ఒక పవర్ ఫుల్ కాప్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక పోస్టర్ లో నాగచైతన్య లుక్ చాలా ఇంటెన్సిటీతో ఉంది. “సమాజంలో మార్పు కావాలని కోరుకున్నప్పుడు, ఆ మార్పు నీలోనే మొదలవ్వాలి” అనే కాప్షన్ తో సినిమా థీమ్ ని చెప్పాడు దర్శకుడు.

ఇక చైతన్య కెరీర్ లో వస్తున్న మొదటి బై లింగువల్ చిత్రం ఇది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. మరి చైతుకి ఈ సినిమా అయినా మాస్ ఇమేజ్ ని తెచ్చి పెడుతుందేమో చూడాలి.

Naga Chaitanya New movie poster and title released

ట్రెండింగ్ వార్తలు