Rajamouli : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఉంటే ఎన్టీఆర్ తొడకొట్టేవాడు.. కానీ..

ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ''ఐదు రోజుల ముందు కూడా సిటీ క‌మీష‌న‌ర్ ఈవెంట్ చేసుకోండని పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈరోజు గణేష్ నిమజ్జ‌నాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబ‌ట్టి పోలీసులను కేటాయించలేము..............

 

Rajamouli :  రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మన అస్త్రాల గురించి రాసిన కథతో భారీగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఇందులో నాగార్జున, అమితాబ్, మౌనిరాయ్ ముఖ్యపాత్రల్లో నటించగా పాన్ ఇండియా సినిమాగా బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్, సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసుకొని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీంతో ఓ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ”ఐదు రోజుల ముందు కూడా సిటీ క‌మీష‌న‌ర్ ఈవెంట్ చేసుకోండని పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈరోజు గణేష్ నిమజ్జ‌నాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబ‌ట్టి పోలీసులను కేటాయించలేము అన్నారు. అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అద్భుత‌మైన అరెంజ్‌మెంట్స్ చేశాం. బ్ర‌హ్మాస్త్రంలో ర‌ణ్‌భీర్ క‌పూర్ అగ్నిని త‌న చేతి నుంచి విసిరే అద్భుత‌మైన శ‌క్తిని క‌లిగిఉంటాడు. అది ట్రైలర్ లో కూడా చూపించారు. దాన్ని లైవ్ లో ప్లాన్ చేశాం. అలాగే రణబీర్ ఎన్టీఆర్ ని తొడకొట్టు చిన్నా అని అన్నప్పుడు ఎన్టీఆర్ తొడ కొడితే ఫైర్ జనరేట్ అయ్యేలా ప్లాం చేశాం. ఇలాంటివి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ప్లాన్ చేశాం. కానీ కుదర్లేదు. ఇవి కచ్చితంగా బ్ర‌హ్మాస్త్ర స‌క్సెస్‌మీట్‌లో చేసి చూపిస్తాం” అన్నారు.

NTR : అభిమానులకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. పోలీసులవల్లే అంటూ..

దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే ఎన్టీఆర్ తొడకొట్టడం చాలా సంవత్సరాల తర్వాత చూసేవాళ్లమని అభిమానులు అంటున్నారు. ఈవెంట్ క్యాన్సిల్ వెనుక రాజకీయ కోణం కూడా ఉందని విమర్శలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రేక్షకులు ఒక మంచి అనుభవాన్ని ఈ ఈవెంట్ ద్వారా మిస్ అయ్యారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా నిరాశ చెందారు.

 

ట్రెండింగ్ వార్తలు