Kalki 2898 AD : ప్ర‌భాస్‌ ‘కల్కి’లో రాజ‌మౌళి..!

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Rajamouli in Kalki 2898 AD

Rajamouli in Kalki 2898 AD : ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. దీపికా పదుకొనే(Deepika Padukone), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని(Disha Patani)లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విలన్‌ (Kamal Haasan) విల‌న్‌గా చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. గణేష్ ఉత్సవాల్లో ఈసారి..

సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ద‌ర్శ‌క దీరుడు రాజ‌మౌళి ఈ చిత్రంలో భాగం కానున్నార‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని ఆ వార్త సారాంశం. దీంతో ప్ర‌భాస్‌, రాజ‌మౌళిని ఒకే సారి తెర‌పై చూస్తే వ‌చ్చే ఆ ఆనంద‌మే వేరు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. చిత్ర బృందం ఇప్ప‌టి వ‌ర‌కు అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌ను చేయ‌లేదు.

Bhairava Dweepam : బాల‌య్య అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. ఆ సినిమా రీ రిలీజ్ మ‌ళ్లీ వాయిదా..

ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా న‌టిస్తున్నార‌నే వార్త‌లు రాగా.. దీనిపై స‌ద‌రు న‌టుడు స్పందిస్తూ ఇలాంటి విష‌యాల‌ను చిత్ర బృంద‌మే వెల్ల‌డించాల్సి ఉంటుంది అంటూ చెప్పారు. ఇక‌ ఇటీవ‌ల నిర్మాత అశ్వినీ దత్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలోని టాప్ గ్రాఫిక్ కంపెనీస్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నాయన్నారు. 100 కోట్లపైగా ఇందుకోసం ఖర్చు చేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. చిత్ర అవుట్ ఫుట్ చూసి తాను ఆశ్చర్యపోయిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌న ఆలోచనకు మించి విజువల్స్ ఉంటాయ‌న్నారు.

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ సంక్రాంతికి వస్తుందా..? నిర్మాత అశ్వినీ దత్ ఏం చెప్పాడు..?

కాగా.. ఎస్ఎస్ రాజమౌళి ప్ర‌స్తుతం త్వరలో మహేష్ బాబుతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా స్ర్కిప్ట్ పూర్తి అయ్యింద‌ని, త్వ‌ర‌లోనే షూటింగ్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు