Pushpa 2: సుకుమార్ ఆలోచనలు అర్థం కావడం లేదంటోన్న ఫ్యాన్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆడియెన్స్‌కు బాగా నచ్చేసింది. ప్పుడు అందరి చూపులు పుష్ప పార్ట్ 2 పైనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ కూడా చేశారు.

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆడియెన్స్‌కు బాగా నచ్చేసింది. దీంతో వారు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్ కారణంగా, ఇప్పుడు అందరి చూపులు పుష్ప పార్ట్ 2 పైనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ కూడా చేశారు.

Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ కోసం గీతా ఆర్ట్స్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన..

అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదిగో, అదిగో అంటున్న చిత్ర యూనిట్ ఎప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అసలు పుష్ప 2 సినిమా షూటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని వారు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆలస్యానికి కారణం దర్శకుడు సుకుమార్ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తొలి భాగం అందుకున్న భారీ విజయం తరువాత రెండో పార్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తనకు తెలుసని, అందుకే వారికి ఎలాంటి నిరుత్సాహం కలగకుండా, ఈ సినిమాను అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు సమయం తీసుకుంటున్నాడట సుకుమార్.

Pushpa 2: ఎంత పెరిగినా ‘తగ్గేదే లే’ అంటోన్న మైత్రీ!

ప్రీ-ప్రొడక్షన్ పనుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా, సినిమా షూటింగ్ ఆలస్యమైనా, ఔట్‌పుట్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా రావాల్సిందే అంటున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. అందుకే ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్‌లో మొదలుపెట్టేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా షూటింగ్ ముగించుకుని 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని సుకుమార్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడట. మరి నిజంగానే సుకుమార్ పుష్ప 2 సినిమా విషయంలో ఆలస్యానికి అసలు కారణమా అనేది తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు