Vijay Devarakonda: ‘ఖుషి’ మూవీని కూడా… విజయ్ దేవరకొండ ప్లాన్ ఏమిటో?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో, ఇప్పుడు ఆయన తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో విజయ్ మార్పులు చేస్తున్నాడట.

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో, ఇప్పుడు ఆయన తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తవగా, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో విజయ్ మార్పులు చేస్తున్నాడట.

Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. మూవీ యూనిట్ క్లారిటీ

ఖుషి చిత్రాన్ని డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాను పలు కారణాల వల్ల వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. అయితే ఈ వాయిదాకు గల కారణాలు ఏమిటనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ ఎఫెక్ట్ ఆడియెన్స్‌లో పూర్తిగా తొలిగిపోయిన తరువాతే ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమాను మరికొంత సమయం తీసుకుని రిలీజ్ చేస్తే ఆడియెన్స్ ఆదరిస్తారని విజయ్ భావిస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Khushi : అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన సమంత, విజయ్.. గ్రూప్ ఫొటోలతో హడావిడి..

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల భామ సమంత హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు