కేటీఆర్ చెప్పినా వినలేదు.. మల్లారెడ్డి ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశానని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలోఉన్న సమయంలో ...

Congress MLA Adluri Laxman

Mallareddy Land Dispute : మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2015 సంవత్సరంలో 82/e సర్వే నెంబర్ లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి మేము భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాత మేము కొనుగోలు చేశాం. 15మంది వ్యక్తుల్లో నేను ఒకడిని. మల్లారెడ్డితో ఈ ల్యాండ్ ఇష్యూ పై పలుమారు మాట్లాడాం. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్ యస్ నాయకులు ఉన్నారు. సర్వేకోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మాజీ మంత్రి మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పాడు. 82/e సర్వే నెంబర్ లో ల్యాండ్ పై ఇంజెక్షన్ అడర్ వేసినా.. దానికి కౌంటర్ వేయలేదని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

Also Read : భూ వివాదం.. మాజీమంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశానని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలోఉన్న సమయంలో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని మల్లారెడ్డికి చెప్పారు. కేటీఆర్ మాటలనే ఆయన పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో అటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్ గిరిలో మల్లా రెడ్డి అధీనంలోఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సూచించిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు.

Also Read : Mallareddy : మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఇప్పుడు చూస్తూ ఊరుకోం. 2016లో ఇదే ల్యాండ్ లో వేసిన ఫెన్షింగ్ తొలగించారు. అప్పుడు మీరు చేసింది దౌర్జన్యం కాదా? ఇప్పుడు వాళ్లు ల్యాండ్ లోకి వస్తే దౌర్జన్యం చేశారని అంటున్నారని మల్లారెడ్డిపై ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లా రెడ్డి చెబుతున్న మాటలు అన్ని బోగస్. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తప్పు అని మల్లారెడ్డి చెబుతున్నారు కదా.. తప్పు అయితే మా మీద యాక్షన్ తీసుకోమనండి. మా ల్యాండ్ లోకే మల్లారెడ్డి వచ్చారు. ఇప్పటికైన మల్లారెడ్డి పెద్దమనిషిలా వ్యవహరిస్తే మంచిది. కచ్చితంగా మా భూమికోసం న్యాయపోరాటం చేస్తాం. ఇప్పుడు సీఎంను కలుస్తాం అంటున్నారు. కలవండి మేము కలుస్తామని లక్ష్మణ్ అన్నారు. 2021 లో 82/e సర్వే నెంబర్ లో ల్యాండ్ ను శ్రీనివాస్ రెడ్డికి అమ్మినాం. ఆ తర్వాత మరికొందరు ప్లాట్ గా డివైడ్ చేస్తున్నారు. నా దగ్గర ల్యాండ్ కొన్న శ్రీనివాస్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే నేను మీడియా ముందుకు వచ్చాను. నేను న్యాయంగా వ్యవహారిస్తానని ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు