భూ వివాదం.. మాజీమంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

భూ వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

భూ వివాదం.. మాజీమంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

Former Minister Mallareddy Arrested

Former Minister Mallareddy Arrested : భూ వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోర్టు వివాదంలోఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్థలంలో వేసిన భారికెడ్లను మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read : North Election Campaign : అందరి చూపు అటువైపే.. అన్నీ ఉత్తర భారత్‌లోని స్థానాలకే ఎన్నికలు!

సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నెలకొంది. రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది పేర్కొంటున్నారు. కాగా శనివారం సర్వే నెం.82లోని స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి.. మరో 15మంది మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని, కోర్టుసైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15మంది పేర్కొంటున్నారు. అయితే, స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. అయితే, మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని పోలీసులకు 15మంది సభ్యులు ఫిర్యాదు చేశారు.

Also Read : Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్‌ గుర్తింపు..

మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..
14ఏళ్ల క్రితం మా అల్లుడు, నా కొడుకులు కలిసి ఈ ప్రాపర్టీ తీసుకున్నాం. ఓ మార్వాడి సేటు దగ్గరనుంచి మేము కొనుగోలు చేశామని మల్లారెడ్డి చెప్పారు. గతంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది. కానీ, కరీంనగర్ చెందిన కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ ల్యాండ్ తమదని అంటున్నారు. ఈ సర్వే నెంబర్లో మొత్తం 17ఎకరాలు ఉంది. అందులో రెండు ఎకరాలకుపైగా నేను కొనుగోలు చేశాను. మేము కొనుగోలు చేసిన సర్వే నెంబర్లు వాళ్ల భూమేనంటూ చెబుతున్నారు. ఎనిమిదేళ్ల నుంచి పేట్ బషీరాబాద్ స్టేషన్ లో కేసుకు నడుస్తుంది. కరీంనగర్ కు చెందిన వాళ్లు నాలుగెకరాలు ఉందంటున్నారు. నిజంగా మీకు ఇక్కడ ల్యాండ్ ఉంటే సర్వే పెట్టుకోమని గతంలో చెప్పాను. కానీ, నిన్నరాత్రి ల్యాండ్ లో వేసిన రేకుల షెడ్లు దౌర్జన్యంగా తొలగించారు. తమ ల్యాండ్ లో దౌర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. మా వాచ్ మెన్ల ఫోన్లను లాక్కున్నారు. మా జాగాలో మమ్ముల్ని కూడా కూర్చొని ఇవ్వడం లేదు. మా దగ్గర దొంగ డాక్యుమెంట్లు లేవు. వాళ్లు అన్నట్లు నాలుగు ఎకరాల భూమి ఎక్కడుందో సర్వేచేసి చూపించండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత దౌర్జన్యంగా నడుస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు రక్షణ లేకపోతే ఎలా. సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మల్లారెడ్డి ప్రశ్నించారు. మా ప్రభుత్వం పోయింది.. చేసేదేమీ లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో ప్రత్యర్థివర్గంకు చెందిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసర్వే నెంబర్లు ఉన్న ల్యాండ్ మొత్తం తనదేనని మల్లారెడ్డి అంటున్నాడు. 82/1/88 మా సర్వే నెంబర్. 82/a మల్లారెడ్డిది. ఎకరం 29 కుంటలు మల్లారెడ్డికి ఉంది. సర్వేచేస్తే ఎవరు ల్యాండ్ వాళ్లకి వస్తుంది. కానీ, మల్లారెడ్డి మాత్రం మొత్తం ఈ సర్వే నెంబర్లో ఉంది నాది అంటున్నారు. 2000 సంవత్సరంలో సర్వే జరిగింది. హైకోర్టు డైరెక్షన్లో డిప్యూటీ లీగల్ సర్వేయర్ ద్వారా సర్వే యించుకున్నాం. మల్లారెడ్డి ల్యాండ్ కు ఎలాంటి డాక్యుమెంటు లేవు. సర్వే కూడా చేయలేదు. మల్లారెడ్డి అనుచరులు మమ్మల్ని పోలీసోళ్ల ముందే కొట్టే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే.. పోలీసులతో రాజశేఖర్ రెడ్డి వాగ్వివాదంకు దిగారు. నా ల్యాండ్ లో నేను ఉన్నాను. గతంలోకూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం. మేము ఎవరి భూమిని ఆక్రమించలేదని అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.