Nilave Success Meet: నిలవే మూవీ సక్సెస్ మీట్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన సినిమా నిలవే. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో సౌమిత్ పోలాడి, శ్రేయసి సేన్ జంటగా నటించారు. సౌమిత్ పోలాడి, సాయి కె వెన్నం కలిసి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్(Nilave Success Meet) మీట్ నిర్వహించారు మేకర్స్. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు సినిమాల్లో ‘నిలవే’ సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది అన్నారు.

జెమిని సురేష్ మాట్లాడుతూ.. బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్ గీతాంజలిలా నిలవే సినిమా నిలుస్తుంది అని అన్నారు.


హీరో సౌమిత్ మాట్లాడుతూ .. కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు ‘బాహుబలి’ లాంటిది అని తెలిపారు.

దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ.. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. మన ఇంటెన్షన్ ప్యూర్‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను అని అన్నారు.

నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ.. మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ అని తెలిపారు.















