×
Ad

Nilave Success Meet: నిలవే మూవీ సక్సెస్ మీట్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన సినిమా నిలవే. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో సౌమిత్ పోలాడి, శ్రేయసి సేన్ జంటగా నటించారు. సౌమిత్ పోలాడి, సాయి కె వెన్నం కలిసి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్(Nilave Success Meet) మీట్ నిర్వహించారు మేకర్స్. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/22
2/22
ఈ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు సినిమాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది అన్నారు.
3/22
జెమిని సురేష్​ మాట్లాడుతూ.. బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్‌ గీతాంజలిలా నిలవే సినిమా నిలుస్తుంది అని అన్నారు.
4/22
5/22
హీరో సౌమిత్ మాట్లాడుతూ .. కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు ‘బాహుబలి’ లాంటిది అని తెలిపారు.
6/22
దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ.. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. మన ఇంటెన్షన్ ప్యూర్‌‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను అని అన్నారు.
7/22
నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ.. మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ అని తెలిపారు.
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22