Engineering Colleges : బీటెక్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఫిక్స్.. ఫుల్ డీటెయిల్స్ ఇలా..
Engineering Colleges : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పంచాయతీ తేలింది. రాబోయే మూడేళ్లు (2025-28) విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఫైనల్ చేసింది.
engineering colleges
- ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఫిక్స్
- 70కాలేజీల్లో పాత ఫీజులే
- ప్రభుత్వానికి నివేదిక అందజేసిన టీఏఎఫ్ఆర్సీ
- త్వరలో ప్రభుత్వం నుంచి విడుదలకానున్న అధికారిక జీవో
Engineering Colleges : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పంచాయతీ తేలింది. రాబోయే మూడేళ్లు (2025-28) విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఫైనల్ చేసింది. ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక జీవో విడుదల కానుంది.
Also Read : Indiramma Indlu : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. ఈసారి వారందరికీ..
రాష్ట్ర వ్యాప్తంగా 157 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26, 2026-2027, 2027-28 విద్యా సంవత్సరాలకుగాను కొత్త ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే కాలేజీల ఆధాయ వ్యయాలతో పాటు అకడమిక్ అంశాలను పరిగణలోకి తీసుకొని ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఫైనల్ చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించింది.
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజల్లో ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. దీంతో రాష్ట్రంలోని 70 కాలేజీల్లో పాత ఫీజులనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించగా.. 63 కాలేజీల్లో ఫీజులను పెంచారు. మరో 19 కాలేజీల్లో మాత్రం గతంలో కంటే ఫీజులు తగ్గించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో విడుదల కానుంది.
రాష్ట్రంలో అత్యధికంగా సీబీఐటీలో రూ.1.83లక్షల ఫీజు ఖరారు చేశారు. గత ఏడాది వరకు ఆ కళాశాల ఫీజు రూ. 1.65లక్షలుగా ఉంది. ప్రస్తుతం రూ.18వేలు పెంచారు. అత్యధికంగా నారాయణమ్మ కళాశాలలో రూ.62వేలు పెంచారు. తొమ్మిది కాలేజీల్లో రూ.20వేలు నుంచి 35వేలలోపు, మరో 18 కళాశాలల్లో రూ.10వేల నుంచి రూ.20వేలలోపు, 36 కళాశాలల్లో రూ.10వేల లోపు పెంచారు.
రూ.లక్షకుపైగా ఫీజులున్న కళాశాలలు..
సీబీఐటీ(1.83), వాసవి(1.75), ఎంజీఐటీ( 1.67), సీవీఆర్(1.63), నారాయణమ్మ(1.62), గోకరాజు(1.60), వీఎన్ఆర్(1.59), ఏస్(1.10), అను బోస్(1.08), బీవీఆర్ఐటీ(1.46), బీవీఆర్ఐటీ మహిళా కళాశాల(1.43), గీతాంజలి(1.21), గురునానక్ టెక్నికల్(1.29), హితమ్(1.05), శ్రీఇందు(1.15), జేబీఐటీ(1.10), కేజీ రెడ్డి( 1.03), కిట్స్(1.46), కేఎంఐటీ(1.29), ముఫకంజా(1.25), ఎంవీఎస్ఆర్(1.44), శ్రీదత్త(1.01), శ్రీదేవి(1.37), శ్రీనిధి(1.33), ఎస్ఆర్(1.41), శ్రేయాస్(1.06), టీకేఆర్(1.03), వాగ్దేవి(1.05), వీబీఐటీ(1.03), విజ్ఞాన్(1.23), వర్ధమాన్(1.40), విజ్ఞాన్స్ మహిళ(1.04). అదేవిధంగా లక్ష ఫీజు కలిగిన కళాశాలు.. గేట్ (1.00), లార్డ్స్(1.00), మాతృశ్రీ ( 1.00)గా ఉన్నాయి.
