Telangana municipal elections: దెబ్బ ఎక్కడ తగిలింది? మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ పోస్ట్‌మార్టం
మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధిష్టానం అప్పుడే పోస్ట్‌మార్టం చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి మిస్ అయినవి, అసలు మనవే అనుకున్నాక కూడా తేడా కొట్టిన మున్సిపాలిటీల్లో ఏం జరిగిందన్నదానిపై గులాబీ పార్టీ ఆరా తీస్తోందట.
- కనీసం 30 మున్సిపాలిటీలను గెలుస్తామనుకున్న బీఆర్ఎస్
- కనీసం 20 స్థానాలు కూడా గెలుచుకోకపోవడంపై అంతర్మథనం
- మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ లోపం జరిగిందన్నదానిపై ఆరా
- ఛైర్మన్ ఎన్నికల్లో ఎక్కడా విఫలమయ్యామన్నదానిపై చర్చ
- మెదక్ నహా మిగిలిన జిల్లాల్లో విఫలం కావడంపై పోస్టుమార్టం
Telangana municipal elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఎంత ఉత్కంఠ రేపాయో..ఆ తర్వాత జరిగిన మేయర్లు, ఛైర్మెన్ల ఎన్నికలు అంతకంటే రసవత్తరంగా జరిగాయి. మున్సిపల్ ఛైర్మెన్లు, వైస్ చైర్మెన్ల ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కోచోట ఒక్కొక్కరితో కలిసిపోవడం ఆసక్తికరంగా మారింది.
ఆ మూడు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చే సరికి ఎవరు ఎవరితో కలుస్తున్నారో..ఈక్వేషన్స్ ఏంటో తెలియక..పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపించాయి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు. ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల తర్వాత మరింత నిరాశ చెందిందంట. మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలు ఛైర్మన్ల ఎన్నిక వరకు బీఆర్ఎస్ అంచనాలు తలకిందులు అయ్యాయన్న చర్చ జరుగుతోంది.
మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధిష్టానం అప్పుడే పోస్ట్‌మార్టం చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి మిస్ అయినవి, అసలు మనవే అనుకున్నాక కూడా తేడా కొట్టిన మున్సిపాలిటీల్లో ఏం జరిగిందన్నదానిపై గులాబీ పార్టీ ఆరా తీస్తోందట. కనీసం 35 నుంచి 40 మున్సిపాలిటీల్లో గెలుస్తామని అంచనాలు పెట్టుకుంటే..ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 17 మున్సిపల్ ఛైర్మన్ సీట్లు వస్తాయని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Also Read: కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా ఎమ్మెల్యే కొలికపూడి.. ఏం జరుగుతోందంటే?
వాటితో పాటు హంగ్ వచ్చిన 36 మున్సిపాలిటీల్లో కనీసం 10 నుంచి 12 మున్సిపాలిటీలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కట్ చేస్తే ఛైర్మన్ల ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మెజార్టీ వచ్చిన మున్సిపాలిటీల్లో కూడా ఛైర్మన్ ర్మన్, వైస్ ఛైర్మన్ పోస్టులను సొంతం చేసుకోలేకపోయింది గులాబీ పార్టీ. హంగ్ వచ్చిన చోట లెక్కలు తప్పాయి. ఆమనగల్, అమరచింత మునిసిపాలిటీలు కన్ఫార్మ్గా తమకు వస్తాయని బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుంటే కాంగ్రెస్ తమ అకౌంట్లో వేసుకుంది.
హంగ్ వచ్చిన ప్రాంతాల్లో అంచనాలు తప్పి..
ఇక తమకు రాదు అనుకున్న రాయికల్ మున్సిపాలిటీలో కారు గేర్ మార్చగలిగింది. హంగ్ వచ్చిన చోట ఒక్కటి అరా తప్పితే మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది. కనీసం 10 హంగ్ మున్సిపాలిటీలు తమ అకౌంట్లో పడతాయని అంచనా వేసినా..చివరికి ఆ అంచనాలు తప్పిపోయాయి. కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కే ఎక్కువ మంది కౌన్సిలర్స్ ఉన్నా ఛైర్మన్ సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది.
జనగామ, తొర్రూరు, జహీరాబాద్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ పెట్టుకున్న హోప్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. తొర్రూర్, జనగామలో టాస్‌లోనూ కాంగ్రెస్‌నే అదృష్టం వరించింది. అటు వేములవాడ లాంటి చోట బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్‌కు కాంగ్రెస్ కండువా కప్పి వైస్ ఛైర్మన్‌గా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చిత్తశుద్ది లేని జంప్ జిలానీలకు టిక్కెట్లు ఇవ్వాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కనీసం 20 మున్సిపాలిటీలు కూడా దాటకపోవడంతో బీఆర్ఎస్లో అంతర్మథనం మొదలైంది. మున్సిపోల్స్‌లో గట్టి పోటీ ఇచ్చినా..ఛైర్మన్ ఎన్నికల్లో పైచేయి సాధించలేకపోయామని గులాబీ పార్టీలో చర్చ నడుస్తోందట. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, అది తమకు కలిసి వస్తుందని ఎన్ని అంచనాలు వేసినా..అధికార పార్టీ దూకుడు ముందు అవేవీ వర్కౌట్ కాలేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆఖరి నిమిషం వరకు జిల్లాల పర్యటనలు చేయని కేటీఆర్, హరీశ్‌రావు చివరి మూడు రోజులు దృష్టి పెట్టడం వల్లే ఈ మాత్రమైనా స్థానాలు దక్కాయన్న చర్చ జరుగుతోంది.
