Himachal assembly polls: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఝలకిచ్చిన ఆనంద్ శర్మ

బీజేపీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాలు మోపేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఎటు నుంచి చూసినా కాంగ్రెస్ పార్టీయే వెనుకంజలో ఉంది. దీనికి తోడు తాజాగా ఆనంద్ సింగ్ రాజీనామా పార్టీని మరింత కలవర పెడుతోంది.

Himachal assembly polls: మరికొద్ది రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయనగా కాంగ్రెస్ పార్టీకి ఆనంద్ శర్మ ఝలక్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై పార్టీ అధినేత సోనియా గాంధీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. ఈ లేఖలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన ఆయన.. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని లేఖలో ప్రస్తావించడం గమనార్హం.

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన ఆనంద్ శర్మ.. స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం పట్ల రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. నవంబర్‭లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‭లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది.

కాగా, బీజేపీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాలు మోపేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఎటు నుంచి చూసినా కాంగ్రెస్ పార్టీయే వెనుకంజలో ఉంది. దీనికి తోడు తాజాగా ఆనంద్ సింగ్ రాజీనామా పార్టీని మరింత కలవర పెడుతోంది.

Amit Shah – Jr.NTR Meeting : అమిత్ షా నుంచి జూ.ఎన్టీఆర్‎కి పిలుపు

ట్రెండింగ్ వార్తలు