అతడు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని బతికేవాడు. అటువంటి వ్యక్తి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో అవమానంగా భావించిన ఆ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రోడ్ల పక్కన ఆ వృద్ధుడు ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్‌కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు రూపొందించడం ప్రారంభించారు.
వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో ఆ వృద్ధుడిని చాలా మంది గుర్తు పట్టేవారు. తన గురించి తీస్తున్న వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
వైరల్ వీడియోలు, ట్రోలింగ్స్ వంటివి చాలా మందిని చిత్రవధకు గురి చేస్తున్నాయి. ఎవరి గురించి పోస్టులు తీస్తున్నామో సదరు వ్యక్తుల అనుమతి లేకుండానే వారి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు చాలా మంది. దీంతో ఆయా వీడియోల్లో వ్యక్తులు ఆందోళన, మనస్తాపానికి గురవుతున్నారు. చివరకు వారు బలవన్మరణానికి పాల్పడుతన్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి.
Also Read : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ ఐదు ఫైళ్లకు ఆమోదం