AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ ఐదు ఫైళ్లకు ఆమోదం

విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ ఐదు ఫైళ్లకు ఆమోదం

AP Cabinet

AP Cabinet Key Decisions : ఏపీలో నూతనంగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగింది. సుమారు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు పలు కీలక అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  వీటిలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Also Read : ఎంపీలుగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు.. పంచెకట్టులో కిషన్ రెడ్డి..

జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో జులై 1న ఒకేసారి 65లక్షల మందికి ఇంటి వద్దే రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు రూ.4వేలు పెన్షన్ వస్తుంది.

విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.