Indian Oil Companies: వంట గ్యాస్ సప్లయ్ లో వీటికే అత్యధిక ప్రాధాన్యత.. ఆయిల్ కంపెనీల కీలక ప్రకటన
మిగతా నాన్-డొమెస్టిక్ సెక్టార్స్ నుంచే వచ్చే విజ్ఞప్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ పరిశీలించి సరఫరా చేస్తామని వెల్లడించాయి.
LPG Representative Image (Image Credit To Original Source)
- డొమెస్టిక్ వినియోగదారులకే అత్యధిక ప్రాధాన్యత
- హాస్పిటల్స్, విద్యా సంస్థల వంటి అత్యవసర సెక్టార్స్కు ప్రయారిటీ ప్రకారం ఎల్పీజీ సరఫరా
- నాన్-డొమెస్టిక్ సెక్టార్స్ నుంచే వచ్చే విజ్ఞప్తుల పరిశీలన
Indian Oil Companies: పశ్చిమాసియా వివాదం ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెంచుతోంది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, చమురు కొరత ఏర్పడుతోంది. గ్యాస్ కొరతపై భారత దేశంలోని ఆయిల్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్ పీ, భారత్ పెట్రోలియం సంస్థలు కీలక ప్రకటన చేశాయి. డొమెస్టిక్ వినియోగదారులతో పాటు హాస్పిటల్స్, విద్యా సంస్థల వంటి అత్యవసర సెక్టార్స్కు ప్రయారిటీ ప్రకారం ఎల్పీజీ సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి. మిగతా నాన్-డొమెస్టిక్ సెక్టార్స్ నుంచే వచ్చే విజ్ఞప్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ పరిశీలించి సరఫరా చేస్తామని వెల్లడించాయి.
అటు దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కాకుండా కట్టడి చేసేందుకు, నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చూసేందుకు కేంద్రం అత్యవసర చర్యలకు దిగింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలపై (చమురు శుద్ధి సంస్థలు) ఎస్మాను (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-ESMA)ను ప్రయోగించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఉండేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదేశించింది.
In light of current geopolitical disruptions affecting global fuel supply, steps have been taken to enhance LPG production and prioritise its availability for domestic consumers and essential non-domestic sectors such as hospitals and educational institutions.
Requests from other… pic.twitter.com/tvAftzauu4— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 10, 2026
