Dhanush Political Entry: ఢిల్లీలో తమిళ హీరో ధనుష్.. కొత్త పార్టీపై సుదీర్ఘ మంతనాలు? తమిళనాట హీటెక్కుతున్న పాలిటిక్స్!
తమిళనాడులో హీరో ధనుష్(Dhanush Political Entry) పొలిటికల్ ఎంట్రీపై ముమ్మర చర్చలు సాగుతుండగా కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది.
Actor dhanush plans new political party in tamil nadu following vijay tvk
Dhanush Political Entry: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీల సందడి ఊపందుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ అనూహ్య విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు సవాలు విసురుతూ విజయ్ సాధించిన ఘనవిజయం, తమిళ చిత్రసీమలోని మరికొందరు స్టార్లకు రాజకీయంగా సరికొత్త ప్రేరణగా నిలిచింది. దీంతో 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరిన్ని నూతన రాజకీయ శక్తిలు రూపుదిద్దుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విజయ్ బాటలో హీరో ధనుష్.. పార్టీ స్థాపనపై ఢిల్లీలో ముమ్మర చర్చలు:
విజయ్ బాటలోనే ప్రయాణిస్తూ నటుడు ధనుష్ (Dhanush Political Entry)రాజకీయ అరంగేట్రానికి ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ధనుష్, కొత్త పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై జాతీయ స్థాయి నాయకులు, రాజకీయ పండితులు, వ్యూహకర్తలతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. ధనుష్‌తో పాటు మరో యువ కథానాయకుడు శివకార్తీకేయన్ కూడా ఇటీవల తన అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించగా, ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై సైతం త్వరలోనే సొంత పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
2029 లక్ష్యంగా కొత్త శక్తులు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోలీవుడ్ ప్రజలు:
ప్రధాన పార్టీలను తలకిందులు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి విజయ్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఊపుతోనే ధనుష్‌తో పాటు ఇతర ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీకి వేగంగా పావులు కదుపుతున్నారు. నటుడు ధనుష్ వ్యూహాత్మకంగా జాతీయ నాయకులను కలుస్తుండటంతో ఆయన పార్టీ సిద్ధాంతాలు, ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై తమిళనాడు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ద్రవిడ రాజకీయాల్లో ఈ కొత్త పార్టీలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.
