Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బంగారు మోదకాలు .. ధర ఎంతో తెలుసా..?!

బొజ్జ గణపయ్యకు బంగారు మోదకాలు. అచ్చమైన బంగారంతో తయారు చేసిన మోదకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

goldan modaks for ganesh

Goldan modaks for ganesh : వినాయక చవితి సందడి నెల రోజుల ముందే మొదలై పండు నుంచి మరో తొమ్మిది రోజులు కోలాహలంగా జరగుతుంది. ఈ తొమ్మిది రోజులు బొజ్జ గణపయ్యకు భక్తులు రకరకాల ప్రసాదాలను సమర్పిస్తుంటారు. గణేశుడికి ఎంతో కుడుములు, ఉండ్రాళ్లు భక్తులు సమర్పించే ప్రసాదాల్లో తప్పనిసరిగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఎందుకంటే గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లు అంటే ఎంతో ఇష్టం.

అందుకే భక్తులు వినాయక చవితికి వేడులు మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు వేళ బొజ్జ గణపయ్యకు భక్తులు కుడుములు, ఉండ్రాళ్లతో పాటు లడ్డులు, చక్కెర పొంగలి,పులిహోర, ఉడికించిన శెనగలు,కేసరి ఇలా రకరకాల నైవేద్యాలు సమర్పించి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో వంటకాన్ని గణనాథుడికి నివేదించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. అటువంటి గణపయ్యకు పెట్టే ప్రసాదాల్లో ఎన్నో విశేషంగా కనిపిస్తుంటాయి. అటువంటిదే బొజ్జ గణపయ్యకు ‘బంగారు మోదకాలు’ అంటే ‘బంగారు కుడుములు’ నైవేద్యంగా సమర్పించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Ganesh Chaturthi 2023 : రూ.2.5 కోట్లు విలువైన నాణాలతో వినాయకుడికి అలంకరణ

గణపతికి నైవేద్యంగా పెట్టేందుకు కొంతమంది వ్యాపారలు బంగారు మోదకాలను విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో బంగారు కుడుములు (మోదక్‌లు) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అచ్చమైన బంగారంతో చేసిన బంగారు రంగులో మెరిసిపోతున్న మోదకాలు అందరికి ఆకట్టుకంటున్నాయి. 24 క్యారెట్ల బంగారు పూతతో తయారుచేసిన కుడుములను కిలో రూ.16,000 అమ్ముతున్నారు వ్యాపారులు. అలాగే బంగారు కుడుములతో పాటు వెండి కుడుములు కూడా అమ్ముతున్నారు. వెండి కుడుబుల ధర రూ.1,600. బంగారు, వెండి కుడుములకు మార్కెట్లో మంచి డిమాండు ఉందని, ఇప్పటికే పెద్దమొత్తంలో అమ్మకాలు చేశామని చెబుతున్నారు నాసిక్ లోని వ్యాపారులు.

Ganesh Chaturthi 2023 : భూగర్భంలో బొజ్జ గణపయ్య .. చెవిలో చెబితే కోరికలు తీర్చే స్వామి

ట్రెండింగ్ వార్తలు