Nitish Kumar: నితీశ్ కుమార్ సపరేట్ రికార్డ్.. 22ఏళ్లలో 8వ సారి సీఎం

బీజేపీతో పొత్తుకు వీడ్కోలు చెప్పిన నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ల సపోర్ట్ తో బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని కావడం కుదరలేదనే వేరొకరితో పొత్తు కోసం బీజేపీని వదిలిపెట్టేశారంటూ నితీశ్ కుమార్ పై కమలం పార్టీ విమర్శలు గుప్పించింది.

 

Nitish Kumar: బీజేపీతో పొత్తుకు వీడ్కోలు చెప్పిన నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ల సపోర్ట్ తో బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని కావడం కుదరలేదనే వేరొకరితో పొత్తు కోసం బీజేపీని వదిలిపెట్టేశారంటూ నితీశ్ కుమార్ పై కమలం పార్టీ విమర్శలు గుప్పించింది.

తాము ధర్మాన్నే నమ్ముతామని, నితీశ్ పార్టీతో పొత్తును బ్రేక్ చేసుకోబోమని బీజేపీ వెల్లడించింది. ఇదిలా ఉంటే, పొలిటికల్ కెరీర్ లో ఎన్ని ఒడిదొడుకులొచ్చినా 8సార్లు సీఎంగా గెలిచి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు.

తొలిసారి: March, 2000
రెండోసారి: November, 2005
మూడోసారి: November, 2010
నాలుగోసారి: February, 2015
ఐదోసారి: November, 2015
ఆరోసారి: July, 2017
ఏడోసారి: November, 2020
ఎనిమిదోసారి: 10, August, 2022

కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌ వాసులంతా ప్రధాని మోదీని చూసే ఓటేశారు. నితీశ్ కుమార్ 2019, 2020లో ప్రధాని మోదీని చూపించి గెలిచారు. ఇప్పుడు ప్రజలకు ద్రోహం చేశారు. ఇది బీజేపీకి ఎదురుదెబ్బ కాదు.

Read Also: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా..ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు!

RJD నాయకుడు శరద్ యాదవ్ మాట్లాడుతూ..‘‘ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు అదే కూటమికి ఓటు వేశారు. గత ప్రభుత్వం (బీజేపీ-జేడీయూ ప్రభుత్వం) ప్రజల ఆదేశానుసారం కాదు, ఇప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేరకే ఉంటుంది. ఆదేశం” అని అన్నారు.

నితీష్ కుమార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి బీహార్‌లోని ఎన్‌డీఏ ప్రభుత్వ సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకోవాలని తమ పార్టీ జేడీ(యూ) నిర్ణయం తీసుకుందని చెప్పారు. RJD, లెఫ్ట్ పార్టీలతో సహా మొత్తం ప్రతిపక్షాల మద్దతుతో కుమార్ తాజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు