Shraddha Murder Case: ఆరోజు రాత్రంత్రా శ్రద్ధా శవం పక్కనే గంజాయి సిగరేట్లు తాగిన ఆఫ్తాబ్.. పోలీసుల విచారణలో వెలుగులోకి కిల్లర్ ఘోరాలు ..

మే18న రాత్రి 9 గంటల సమయంలో శ్రద్ధా హత్య జరిగింది. ఆ సమయంలో ఆఫ్తాబ్ ఎక్కువగా గంజాయిని తీసుకున్నట్లు విచారణలో వెల్లడయింది. తాను గంజాయికి బానిసనని, శ్రద్ధాను హత్యచేసిన సమయంలో ఎక్కువగా గంజాయిని సేవించి ఉన్నానని విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించారు.

Shraddha Murder Case: శ్రద్ధా హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కిల్లర్ ఆఫ్తాబ్ ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారు. తనను నమ్మివచ్చిన శ్రద్ధాతో సహజీవనం చేస్తూ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసుల వివచారణలో వెల్లడవుతోంది. ఆఫ్తాబ్ దారుణంగా కొట్టేవాడని ఆమె స్నేహితులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈకేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నార్కో పరీక్షల నిమిత్తం మరో ఐదు రోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆఫ్తాబ్ ను ఉరితీయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే పోలీసుల విచారణలో ఆఫ్తాబ్ ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Aftab and Shraddha: కోపం వచ్చినప్పుడల్లా శ్రద్ధ తలతో మాటలు.. సైకో అఫ్తాబ్‌

మే18న రాత్రి 9 గంటల సమయంలో శ్రద్ధా హత్య జరిగింది. ఆ సమయంలో ఆఫ్తాబ్ ఎక్కువగా గంజాయిని తీసుకున్నట్లు విచారణలో వెల్లడయింది. తాను గంజాయికి బానిసనని, శ్రద్ధాను హత్యచేసిన సమయంలో ఎక్కువగా గంజాయిని సేవించి ఉన్నానని విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించారు. శ్రద్ధా తరచూ తనతో గొడవపడేదని కూడా చెప్పాడు. ఆఫ్తాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రద్ధా, ఆఫ్తాబ్ ఇద్దరూ ఇంటి ఖర్చుల విషయంలో, ముంబై నుండి ఢిల్లీకి కొన్ని వస్తువులను ఎవరు తీసుకురావాలనే దానిపై రోజంతా గొడవ పడ్డారు. శ్రద్ధను చంపడం తనకు ఇష్టం లేదని అఫ్తాబ్ పోలీసులకు చెప్పాడని, అయితే ఆమె తనపై అరవటం కొనసాగించిందని, దీనివల్ల సహనం కోల్పోయి ఆమెను చంపేశానని పోలీసుల విచారణలో ఆఫ్తాబ్ తెలిపినట్లు తెలుస్తోంది. శ్రద్ధా గొంతు నులిమి చంపిన తర్వాత, అఫ్తాబ్ రాత్రంతా గంజాయితో నిండిన సిగరెట్ తాగుతూ మృతదేహం దగ్గరే ఉండిపోయాడని ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Shradha Murder Case: శ్రద్ధా మృతికేసులో కిల్లర్ అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు.. కోర్టు అనుమతి

శ్రద్ధాను హత్యచేసే సమయంలో నిందితుడి చేతికి గాయమైంది. గాయంకు చికిత్స కోసం స్థానికంగా ఉన్న క్లినిక్ కు వెళ్లాడు. ఇటీవల పోలీసులు ఆఫ్తాబ్ ను అరెస్టు చేశాక ఆ క్లీనిక్ కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆఫ్తాబ్ ను గుర్తుపట్టి విషయం పోలీసులకు తెలిపాడు. అయితే, మే నెలలో తన వద్దకు చికిత్సకోసం వచ్చిన సమయంలో పండ్లు కోస్తుంటే చాక్ తగిలి చేతికి గాయమైదని చెప్పాడని వైద్యుడు పోలీసులకు వివరించారు. ఇదిలాఉంటే శ్రద్ధా శరీరభాగాలను డెహ్రాడూన్‌లో కూడా విసిరినట్లు చెప్పాడని, పోలీసులు అక్కడకు వెళ్లి సెర్చ్ ఆపరేషన్ చేయాలని యోచిస్తున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి.

ట్రెండింగ్ వార్తలు