Haryana : డాక్టర్ వృత్తిని విడిచిపెట్టి వ్యాపార రంగంలో దూసుకుపోతున్న డైనమిక్ లేడీ… ఎవరంటే..

డాక్టర్ అవబోయి యాక్టర్ అయ్యామని కొందరు చెబుతుంటారు. ఓ లేడీ వైద్య వృత్తిని విడిచిపెట్టి వ్యాపార రంగంలోకి అడుగులు వేసింది. విజయపథంలో దూసుకుపోతోంది. ఎవరామె? చదవండి.

Dr Drishti Anand Success Story

Haryana : వైద్య వృత్తిని విడిచిపెట్టి వ్యాపార రంగంలోకి రావడం అంటే.. ఆలోచించాల్సిన విషయమే.. హర్యానా గురుగ్రామ్‌కి చెందిన డాక్టర్ దృష్టి ఆనంద్ లాభదాయకమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ‘లెట్స్ డ్రెస్ అప్’ అనే కంపెనీని ప్రారంభించడం వెనుక కారణాలు తెలిస్తే అభినందించి తీరతారు.

Ankur Warikoo : సోషల్ మీడియాలో తన ‘ఫెయిల్యూర్ రెజ్యూమ్’ పంచుకున్న యూట్యూబర్, రచయిత అంకుర్ వారికూ

ఒక్కోసారి మనకి వచ్చే ఆలోచనలు మన జీవితాన్ని మార్చేస్తాయి. నిజమే..గురుగ్రామ్‌కి చెందిన డాక్టర్ దృష్టి ఆనంద్ గురించి చెబితే నిజమంటారు. డాక్టర్ దృష్టి ఆనంద్ ‘డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్’ (PGIMER)లో అనస్థీషియా విభాగంలో జూనియర్ రెసిడెంట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. తరువాత మెదాంత, సఫ్దర్‌జంగ్ ఢిల్లీ వంటి ఆసుపత్రులలో పనిచేశారు. ఆ సమయంలో తనకు ఫిట్ అయ్యే డ్రెస్సుల కోసం తెగ వెతికేవారట. అయితే సరైన సైజ్‌లో దొరకక వాటి కోసం గంటల కొద్దీ సమయం వెచ్చించేవారట. ఆమె భర్త ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. నీలాగే మూడింట రెండు వంతుల మంది ఇండియన్స్ తాము ధరించే డ్రెస్సులు ఫిట్‌గా లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన ఒక సందర్భంలో చెప్పారట. ఇదే మాట దృష్టి ఆనంద్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగంలోకి వెళ్లాలనే మార్గాన్ని చూపించింది. ‘లెట్స్ డ్రెస్ అప్’ అనే కంపెనీ ప్రారంభానికి పునాది పడేలా చేసింది.

Doctors ChatGPT : పేషెంట్ల అనారోగ్యంపై ఇక బ్యాడ్ న్యూస్ చెప్పేది ఏఐ చాట్‌జీపీటీలే.. డాక్టర్లు కాదట.. ఎందుకో తెలుసా?

రూ.15 కోట్ల పెట్టుబడితో ఆమె మొదలుపెట్టిన వ్యాపారం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె కంపెనీ నుంచి XS నుండి 8 XL వరకు అన్ని సైజుల వారీగా దుస్తులను అందిస్తున్నారు. ఈ విధంగా దేశంలోని చాలామంది మహిళల ఎదుర్కుంటున్న సమస్యకు పరిష్కారం చూపినట్లైంది. సైజ్ చార్టును రూపొందించే ముందు 3000 మంది మహిళల నుంచి శాంపిల్ తీసుకున్న మొదటి కంపెనీ కూడా ఆమెదేనట. నెల నెలా 50 శాతం లాభాలతో ముందుకు దూసుకుపోతున్న ఆమె కంపెనీ ‘టాటా క్యాపిటల్’ నుంచి కూడా నిధులు పొందింది. త్వరలో తమ కంపెనీ రూ.100 కోట్ల మార్కును చేరనుందని డాక్టర్ దృష్టి ఆనంద్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. చేసే వృత్తిని సైతం వదిలిపెట్టి వ్యాపార రంగంలో ఛాలెంజింగ్‌గా దూసుకుపోతున్న డాక్టర్ దృష్టి ఆనంద్ చాలామంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తారనడలో అతిశయోక్తి లేదు.

ట్రెండింగ్ వార్తలు