Ankur Warikoo : సోషల్ మీడియాలో తన ‘ఫెయిల్యూర్ రెజ్యూమ్’ పంచుకున్న యూట్యూబర్, రచయిత అంకుర్ వారికూ

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో వైఫల్యాలు చవి చూసిన తరువాత విజయం సాధించిన వారెందరో ఉన్నారు. వారిలో 'అంకుర్ వారికూ' ఒకరు. ప్రస్తుతం యూట్యూబర్ గా, రచయితగా దూసుకుపోతున్న ఆయన తన ఫెయిల్యూర్ రెజ్యూమ్‌ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆయన లైఫ్ స్టోరి చాలామందిలో ప్రేరణ కలిగిస్తోంది.

Ankur Warikoo

Ankur Warikoo : జీవితంలో ఓటమి అందరినీ భయపెడుతుంది. కానీ వైఫల్యాలే మనం విజయం సాధించగల శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాయి. కొందరి జీవిత కథలు చదివితే ప్రేరణ కలిగిస్తాయి. తాజాగా యూట్యూబర్, లైఫ్ అండ్ ఫైనాన్స్ కోచ్, రచయిత అంకుర్ వారికూ గురించి తెలుసుకుంటే ఫెయిల్యూర్‌తో జీవితం ఆగిపోదని స్పష్టం చేస్తుంది. అంకుర్ వారికూ తాజాగా తన వైఫల్యాలు విజయానికి ఎలా దారిని చూపాయో చెబుతూ ఫెయిల్యూర్ రెజ్యూమ్ అంటూ తన లైఫ్‌లోని కొన్ని అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Mamata Banerjee Workout: ట్రెడ్ మిల్‌పై కుక్కపిల్లతో మమతా బెనర్జీ వర్కౌట్లు.. అదనపు ప్రేరణ కావాలంటూ ట్వీట్..

అంకుర్ వారికూ కూడా తన జీవితంలో ఎదుర్కున్న వైఫల్యాల జాబితాను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అతని వైఫల్యాల జాబితా చూస్తే ప్రతి ఒక్కరు కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. తను IIT లో చేరలేకపోవడం, సెయింట్ స్టీఫెన్స్ వంటి ప్రముఖ సంస్థలకు రాసిన ప్రవేశ పరీక్షలను క్లియర్ చేయలేకపోవడం,కార్పొరేట్ కంపెనీలు తిరస్కరించడం అతని జీవిత ప్రయాణంలో ఎదుర్కున్న ఎదురుదెబ్బలు తన అక్షరాల్లో రాసుకొచ్చారు.

 

పీహెడ్డీ కోసం ఏడు యూనివర్సిటీలకు దరఖాస్తు చేస్తే అందులో ఒక నెలలో ఆరుగురు తిరస్కరించారట.తన MBA బ్యాచ్ మేట్‌తో ఒక స్టార్టప్‌లో చేరితే ఒక సంవత్సరం తర్వాత అతను తొలగించాడట. Groupon ఇండియాలో పని చేస్తున్నప్పుడు కంపెనీలో తన ప్రయాణం గురించి అంకుర్ వారికూ వివరించారు ఆ తరువాత ఆయన నియర్ బై సంస్థ స్ధాపించారు. ప్రస్తుతం యూట్యూబర్‌గా లైఫ్ అండ్ ఫైనాన్స్ కోచ్‌గా రచయితగా దూసుకుపోతున్నారు. ‘డూ ఎపిక్’ అతని మొదటి పుస్తకం. 2022 లో ‘గెట్ ఎపిక్ షిట్ డన్’ ప్రచురించారు. ‘ఫ్యార్యూన్ 30 అండర్ 30’ అవార్డుతో పాటు 2022 లో ‘గోల్డెన్ బుక్ అవార్డ్స్’ అవార్డులు అందుకున్నారు.

74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి

జీవితంలో ఓటమి తరువాత ఏమీ లేదనుకునే వారికి అంకుర్ వారికూ జీవితం ఓ మంచి పాఠం. తన వైఫల్యాలను సాధించిన విజయాలను వరుసగా ఆయన పోస్ట్ చేసిన ట్వీట్లు చదివితే అర్ధం అవుతుంది. డబ్బులు లేని పరిస్థితిని, సరైన ప్రణాళిక లేకుండా నడిచిన దారులు, కెరియర్ లేదని బాధపడిన రోజులు దాటుకుని ఇప్పుడు అంకుర్ వారికూ వ్యాపారవేత్తగా, టీచర్‌గా, కంటెంట్ రైటర్ గా, రచయితగా, స్పీకర్‌గా దూసుకుపోతున్నారు. ఎంతోమందికి ప్రేరణ కలిగిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు