అంబానీల ఇంట పెళ్లీలలో నీళ్లలా వేల కోట్ల ఖర్చు.. జిల్ జిల్ జిగేల్‌మనేలా పెళ్లి వేడుకలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడి ఇంట జరిగిన వివాహ వేడుకను అయితే మాటల్లో వర్ణించలేం. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వేల కోట్లు ఖర్చు అయి ఉంటుందని అంచనా.

How much Ambani family spend Anant Radhika Marriage

Anant Radhika Marriage: మధ్య తరగతి వాడింట్లో పెండ్లి అంటే లక్షల్లో ఖర్చు. ధనవంతుల ఇండ్లల్లో మ్యారేజ్ అంటే వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అపర కుబేరుల వివాహ వేడుకలకు అయితే లెక్కే ఉండదు. ప్రీ వెడ్డింగ్, ఎంగేజ్ మెంట్ అంటూ వందలు, వేల కోట్లు నీళ్లలా ఖర్చు పెడుతారు. ఇండియాలోనే మ్యారేజ్‌లు అంటే ఆస్తులు నీళ్లలా కరిగిపోయే పరిస్థితి ఉంది. ఇక డెస్టినేషన్ మ్యారేజ్‌లు అంటూ ప్యాలెస్‌లు, రిసార్ట్‌లలో వివాహాలు చేసుకునే వారికి అయితే లెక్కలేదు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడి ఇంట జరిగిన వివాహ వేడుకను అయితే మాటల్లో వర్ణించలేం. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వెడ్డింగ్ ప్రాసెస్ ఆరు నెలలుగా సాగుతోంది. ఎంగేజ్‌మెంట్, ప్రీవెడ్డింగ్ అంటూ ఎలా ఎన్నో ఈవెంట్లు జరిపారు. ఇక పెళ్లికి అయితే స్వర్గమే భూలోకానికి దిగివచ్చిందా అన్నట్లుగా ఏర్పాటు చేశారు. వేలాది రకాల వంటకాలు, తరలివచ్చిన అతిథులకు విలువైన గిఫ్ట్‌లు అన్నీ కలిపి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వేల కోట్లు ఖర్చు అయి ఉంటుందని అంచనా.

ఇంతకముందు తన కూతురు ఇషా అంబానీ వివాహం అంగరంగ వైభవంగా చేశారు ముకేశ్ అంబానీ. ఆ వివాహం అత్యంత ఖరీదైన మ్యారేజ్‌లో ఒకటిగా నిలిచింది. ఇషా అంబానీ పెండ్లి కోసం ముకేశ్ ఫ్యామిలీ రూ. 400 కోట్లు ఖర్చు చేసిందని టాక్. అత్యంత ఖరీదైన వివాహ డ్రస్‌ ధరించిన వధువుగా రికార్డు ఇషా అంబానీకే దక్కుతుంది. ఎందుకంటే ఇషా అంబానీ ఏకంగా రూ. 90 కోట్ల విలువైన గోల్డెన్ అండ్ రెడ్ లెహెంగా ధరించారు.

గోల్డ్ కోటెడ్ ఇన్విటేషన్ కార్డు
ముకేశ్ అంబానీనే కాదు పలువురు ప్రముఖుల తమ పిల్లల పెండ్లీలకు అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. కర్నాటకకు చెందిన మాజీ మంత్రి, జనార్దన్ రెడ్డి కూతురు వివాహానికి 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఆ పెళ్లి దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఈ ఒకటిగా నిలిచింది. జనార్దనరెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం 2016 నవంబర్ 6న జరిగింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వివాహానికి దాదాపు 50వేల మంది అతిథులు హాజరయ్యారు. కూతురు పెండ్లి పత్రిక కూడా గోల్డ్ కోటెడ్ ఇన్విటేషన్ కార్డు కొట్టించారు గాలి జనార్ధన్‌రెడ్డి.

తెలుగు రాష్ట్రాల్లోనూ..
తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖ రాజకీయ నేతల కూతుర్ల వివాహం కూడా గ్రాండ్‌గా జరిగింది. పెండ్లి పత్రిక నుంచి వివాహం జరిగే వరకు ప్రతీది చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించారు. వందలకోట్లు ఖర్చు పెట్టి.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా పెద్దపెద్ద సెట్టింగ్‌లు, డెకరేషన్లు ఓ రేంజ్‌లో చేశారు.

Also Read : హార్ట్ టచింగ్ వీడియో.. ఇది కదా సక్సెస్ అంటే.. ఆనందంతో అమ్మ కళ్లలో కన్నీళ్లు

ధనవంతులే కాదు సామాన్యులు కూడా పెళ్లిని గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ప్రీవెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు, ఎంగేజ్‌మెంట్ నుంచి మ్యారేజ్ వరకు ప్రతీది అట్రాక్టివ్‌గా ఉండేందుకు అప్పు చేసైనా పెళ్లి వేడుకను జిల్ జిల్ జిగేల్‌ మనిపిస్తున్నారు. ఫోటో షూట్ నుంచి భోజనాల వరకు అన్నీ కలిపి పెద్ద బడ్జెట్టే అవుతోంది. అయినా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు జనం.

Also Read : భార్య దెబ్బకు జొమాటోకు భర్త రిక్వెస్ట్.. కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన సంస్థ.. అదేమిటంటే?

అందమైన లొకేషన్లలో పెండ్లీలు
ఇక డెస్టినేషన్ మ్యారేజ్‌స్ కూడా ఇటీవల పెరిగిపోయాయి. మన దేశంలో రాజస్థాన్ ప్యాలెస్‌లు, జమ్మూకశ్మీర్ లోయలోని అందమైన లొకేషన్లలో పెండ్లీలు చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ధనవంతులు అయితే ప్రపంచదేశాల్లోనే వివిధ ప్రాంతాలకు వెళ్లి మ్యారేజెస్‌ చేసుకుంటున్నారు. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, మాల్దీవులు, బాలీ, జమైకా.. ఇంకా కొత్త కొత్త ఏరియాలు వెడ్డింగ్ కు వేదికలుగా మారుతున్నాయి. అక్కడికి వెళ్లి పెండ్లి చేసుకోవాలంటే.. ఇక్కడ నుంచి వెళ్లే గెస్టులతో పాటు.. అక్కడ పెండ్లి, భోజన ఏర్పాట్లు.. ట్రావెలింగ్ కాస్ట్ భారీ బడ్జెట్ అవుతుంది. స్పెషల్ ప్రైవేట్ చాపర్స్ బుక్ చేసుకోవడం నుంచి తిరిగి ఇండియాకి వచ్చేంత వరకూ అంతా గ్రాండ్‌గానే ఉండేలా చూసుకుంటున్నారు. అయినా ఖర్చుకు వెనకాడకుండా ప్రతీ ఏడాది వేలాదిమంది విదేశాలకు వెళ్లి మ్యారేజ్ లు చేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు