అసలే నిరుద్యోగ భారతం. దొరక్క దొరక్క చిన్న ఉద్యోగం దొరికితే వచ్చిన జీతం అంతా ఇంటి అద్దెకే పోతుంది. ఇటువంటి పరిస్థితులే చాలా మందికి ఎదురవుతున్నాయి. తాజాగా, ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేశాడు.
అద్దె ఇంటి కోసం వెతుకుతున్నానని.. ఇరుకుగా ఉండి, గాలి, వెలుతురు కూడా సరిగ్గారాని చిన్న గదికి రూ.10 వేల అద్దె అడుగుతున్నారని చెప్పాడు. ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో తనకు ఈ అనుభవం ఎదురైందని తెలిపాడు. అద్దె ఇంటి కోసం వెతుక్కుంటూ తిరుగుతున్న తనకు ఓ బ్రోకర్ తగిలాడని చెప్పాడు. ఓ ప్రీమియం క్వాలిటీ రూమ్ చూపిస్తానని తనను తీసుకు వెళ్లాడని తెలిపాడు.
అక్కడికి వెళ్లి చూస్తే అది చాలా చిన్నగా, ఊపిరి కూడా సరిగ్గా ఆడనివ్వకుండా ఉందని చెప్పాడు. తనకు మంచి రూమ్ దొరకడం లేదని, అద్దె గది వెతుక్కోవడంలో ఎవరైనా సాయం చేయండని కోరాడు. అతడి పోస్ట్ పై స్పందించిన నెటిజన్లు.. తమకు ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయని తెలిపారు.
This is premium quality ₹10000/month room in Old Rajendra Nagar as per the broker, Somebody please help me find a room 😭😭😭 pic.twitter.com/o71Ag9SIBO
— Rishabh Tiwari ⍟ (@rishub_1) July 10, 2024
Also Read: మరో గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ అంటూ వారి ఫొటో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర