పెరిగిపోతున్న పెళ్లిళ్ల ఖర్చు.. దేనికి ఎంత పెడుతున్నారో తెలుసా.. రోల్డ్‌ గోల్డ్‌తో కానిచ్చేస్తున్నారా‌?

ఇండియాలో పెండ్లి చాలా ఖరీదైపోతోంది. ఉన్నోళ్లు ఉన్నట్లుగా చేసుకుంటే లేనోడు ఉన్నదాంట్లో బెటర్‌గా చేసుకునేందుకు ఆరాటపడుతున్నాడు.

how indian marriage market rise with full swing what report reveal

Indian marriage market: పెండ్లీలు ఖరీదవుతున్నాయి. వచ్చే గెస్టులను బట్టి కాదు.. చేసే అరేంజ్‌మెంట్లను బట్టి ఖర్చు పెరిగిపోతోంది. సినిమాలను మించి సెట్టింగ్‌లు.. స్వర్గాన్ని తలపించే డెకరేషన్‌తో మ్యారేజ్‌స్‌ జిల్‌ జిగేల్‌మంటున్నాయి. వచ్చేది వందలమంది అతిథులే. వారికి వడ్డించేది మాత్రం వేలాది రకాల వంటకాలు. ఇచ్చే గిఫ్టులు కూడా కాస్ట్‌లీనే. ఇలా ఇండియాలో పెండ్లి చాలా ఖరీదైపోతోంది. ఉన్నోళ్లు ఉన్నట్లుగా చేసుకుంటే లేనోడు ఉన్నదాంట్లో బెటర్‌గా చేసుకునేందుకు ఆరాటపడుతున్నాడు.

ప్రతీ ఏటా మ్యారేజెస్‌ కాస్ట్ పెరిగిపోతోంది. 2022- 2023 ఏడాదిలో దేశంలో జరిగిన వివాహాలకు 4.72 ట్రిలియన్ డాలర్ల ఖర్చు అయినట్లు ఓ అంచనా. అది కాస్త 2023-2024 ఏడాదికి వచ్చేసరికి 5.52 ట్రిలియన్లకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. తక్కువలో తక్కువగా 8 శాతం యానువల్‌ వృద్ధి రేటుతో పెండ్లీల బిజినెస్‌ పటిష్టమవుతోంది. వెడ్‌ మి గుడ్‌ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో 2వేల 9వందల జంటలు పాల్గొన్నాయి. వాళ్ల అంచనాల ప్రకారం సగటున ఓ వివాహానికి 3 వందల మంది అతిథులు హాజరవుతున్నారు.

సమంగా పెండ్లి ఖర్చు
59 శాతం వధువరులు పెండ్లి ఖర్చును సమంగా పెట్టుకున్నట్లు సర్వేలో తేలింది. 32 శాతం వివాహాలకు మాత్రం వధువు కుటుంబంపైనే ఎక్కువ భారం పడుతుందని అంచనా. కొందరు యువత తాము సంపాదించిన సొంత సొమ్ముతో పెండ్లీలు చేసుకుంటే, 30 శాతం వధువరులు మాత్రం కుటుంబాల ఆర్థిక సహకారాన్ని కోరుకుంటున్నారు. ఇక వివాహ ఆభరణాల పరంగా 36 శాతం మంది వధువులు రోల్డ్‌ గోల్డ్‌ వాడేందుకే ఆసక్తి చూపిస్తుంటే..16 శాతం మంది మాత్రం రెంటల్ గోల్డ్‌ ఆర్నమెంట్‌తో పెండ్లిని కానిచ్చేస్తున్నారు.

బట్టలకు 15 శాతం ఖర్చు
ఎంగేజ్‌మెంట్‌ నుంచి పెళ్లి వరకు అయ్యే ఖర్చుపై కూడా వెడ్‌ మి గుడ్‌ సంస్థ సర్వే చేసింది. ఎంగేజ్‌మెంట్‌ రింగులకు వధువరులు సమానంగా ఖర్చు పెట్టుకుంటున్నారని ఓ లెక్క. మొత్తం పెండ్లిలో అయ్యే ఖర్చులో 15 శాతం బట్టలకు.. హెయిర్‌ స్టైల్‌, మేకప్‌కే అవుతుందని అంచనా. పెండ్లి బడ్జెట్‌లో దాదాపు 45 శాతం ఫంక్షన్‌ హాల్‌, ఫుడ్‌ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 30 శాతం వరకు డెకరేషన్‌, డీజేలు ఇతర వాటికి కేటాయిస్తున్నట్లు అంచనాలున్నాయి.

వధువు కుటుంబానికి ఖర్చు భారం
పెండ్లి అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. ఏరియాలను సంప్రదాయాలను బట్టి కొన్ని ఏరియాల్లో వధుడికి.. చాలా ఏరియాల్లో వధువు కుటుంబానికి ఖర్చు భారం ఎక్కువగా ఉంటుంది. 2023లో దేశవ్యాప్తంగా 38 లక్షల పెండ్లీలు జరిగితే.. దాదాపు 4 లక్షల 72 వేల కోట్ల బిజినెస్‌ జరిగిందని అంచనా. ఇది 2022తో పోలిస్తే 26 శాతం ఎక్కువ. భారతీయ వివాహ వేడుకల్లో ఎక్కువగా ఫంక్షన్‌ హాల్ బుకింగ్‌, పెండ్లి పందిరి, భోజనాలు, పెండ్లి బట్టలు, ఆభరణాలు, ఫోటో, వీడియో గ్రఫీ కోసం ఎక్కువగా ఖర్చు అవుతోంది.

Also Read : అనంత్ అంబానీ పెళ్లి వేళ.. వైరల్ అవుతున్న ముకేశ్ అంబానీ పెళ్లి ఫొటో..

10 లక్షల మందికి ఉపాధి
ఇండియాలో వెడ్డింగ్ బిజినెస్‌ లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రతీ ఏడాది మ్యారేజ్‌ సీజన్‌లో కొన్ని లక్షల మంది బిజీ అయిపోతున్నారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు, మ్యూజిక్ ఆర్టిస్టులు, సింగర్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆర్టిస్టులు ఇలా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నట్లు అంచనాలున్నాయి.

Also Read : అపర కుబేరుడి ఇంట వెడ్డింగ్ వేడుక.. జిగేల్‌మనేలా సెలబ్రేషన్స్.. ఖర్చెంతో తెలుసా?

పెండ్లీలకు సంబంధించే కాకుండా దాని అనుబంధ రంగాలపై కూడా మ్యారేజ్ మార్కెట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. హోటల్స్, టూరిస్ట్‌ ప్లేస్‌లు, షాపింగ్‌ మాల్స్‌, గోల్డ్‌ షాప్స్‌కు మ్యారేజ్‌ సీజన్‌లో ఫుల్ బిజినెస్‌ ఉంటోంది. ఆర్నమెంట్స్‌ తయారు చేసేవాళ్లకు మ్యారేజ్‌ సీజన్‌లో ఉండే డిమాండ్ అయితే చెప్పక్కర్లేదు. ఇలా రోజురోజుకు వెడ్డింగ్ బిజినెస్‌ ఎక్స్‌ప్యాండ్‌ అవుతోంది. రానున్న రోజుల్లో మ్యారేజెస్‌ మార్కెట్‌ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు