Mukesh Ambani : అనంత్ అంబానీ పెళ్లి వేళ.. వైరల్ అవుతున్న ముకేశ్ అంబానీ పెళ్లి ఫొటో..

వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబాని పెళ్లి వేడుకలు గత కొన్నాళ్లుగా గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Mukesh Ambani : అనంత్ అంబానీ పెళ్లి వేళ.. వైరల్ అవుతున్న ముకేశ్ అంబానీ పెళ్లి ఫొటో..

Mukesh Ambani Nita Ambani Wedding Photo goes Viral while Ananth Ambani Radhika Marriage Happening

Updated On : July 15, 2024 / 1:59 PM IST

Mukesh Ambani : వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబాని పెళ్లి వేడుకలు గత కొన్నాళ్లుగా గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ పార్టీలు, పలు సెలబ్రేషన్స్ తర్వాత గత అయిదు రోజులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో గ్రాండ్ గా జరిగాయి.

అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు దేశవిదేశాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా.. పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా డ్యాన్సులు వేసి సందడి చేశారు. కొత్త జంటని ఆశీర్వదించారు. దేశం మొత్తం మాట్లాడుకునేలా అనంత్ అంబానీ -రాధికా పెళ్లిని ఘనంగా చేశారు. అయితే అనంత్ అంబానీ పెళ్లి వేడుకల వేళ ముకేశ్ అంబానీ పెళ్లి ఫొటో వైరల్ అవుతుంది.

Also Read : Aditi Govitrikar : ‘తమ్ముడు’ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

ధీరుభాయి అంబానీ పెద్ద కొడుగ్గా వ్యాపారరంగంలోకి వచ్చిన ముకేశ్ అంబానీ ఇప్పుడు తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యం సృష్టించుకొని ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకడిగా ఎదిగాడు. ముకేశ్ అంబానీ పెళ్లి 1985లో నీతాతో జరిగింది. ముకేశ్ తండ్రి ధీరుభాయి అంబానీ ఇప్పుడు అనంత్ పెళ్లి అంత ఘనంగా చేయకపోయినా ఆయన కూడా అప్పటికి తగ్గట్టు గ్రాండ్ గానే పెళ్లి చేశారు. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల నుంచి బోలెడన్ని ఫొటోలు వస్తుండగా అనంత్ తల్లితండ్రులు ముకేశ్ అంబానీ – నీతా అంబానీ పెళ్లి ఫొటోలు కూడా బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి.

Mukesh Ambani Nita Ambani Wedding Photo goes Viral while Ananth Ambani Radhika Marriage Happening