మరో గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ అంటూ వారి ఫొటో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర

Anand Mahindra: ఆ ఫొటోలో జేడీ వాన్స్, ఉష చిలుకూరి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనపడుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి అమెరికాలో స్థిరపడిన తెలుగుంటి అమ్మాయే.

జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పటికే ఆయన ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు జేడీ వాన్స్, ఉష చిలుకూరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వారిద్దరి ఫొటోలను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా పోస్ట్ చేశారు. దీనికి అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చారు.

ఆ ఫొటోలో జేడీ వాన్స్, ఉష చిలుకూరి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనపడుతున్నారు. గతంలో వారు దిగిన ఈ ఫొటోను ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేస్తూ.. ‘‘మనం వేడుక చేసుకోవడానికి మరో గొప్ప భారతీయ వివాహం ఇది’’ అని పేర్కొన్నారు. నవ్వుతున్న ఎమోజీని ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. ఇటీవల అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాన్ని గుర్తు చేస్తూనే మరో గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.

Also Read: ప్యాకెట్‌లో నూనెను కింద పడకుండా బాటిల్‌లో పోయగలరా..! హీరోయిన్ షేర్ చేసిన వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు