BMW CE 04 EV Scooter : బీఎండబ్ల్యూ ఫస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదిగో.. ఈ నెల 24నే లాంచ్.. ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

BMW CE 04 EV Scooter : బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా దేశంలోని తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను ప్రారంభించింది.

BMW CE 04 premium electric scooter to launch in India ( Image Source : Google )

BMW CE 04 EV Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ నుంచి మొట్టమొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 24న బీఎండబ్ల్యూ CE 04 స్కూటర్ అధికారికంగా లాంచ్ కానుంది.

Read Also : Usha Chilukuri Vance : భారతీయ సీఈఓను నియమించుకోండి.. ఉషా చిలుకూరి వాన్స్‌పై పోస్టుకు మస్క్ రియాక్షన్..!

బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా దేశంలోని తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను ప్రారంభించింది. బీఎండబ్ల్యూ సీఈ 04ని బుక్ చేసుకోవడానికి కస్టమర్‌లు తమ సమీప బీఎండబ్ల్యూ మోటోరాడ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. బీఎండబ్ల్యూ సీఈ 04 2021లో గ్లోబల్ అరంగేట్రం చేసింది.

పర్మినెంట్-మాగ్నెట్ లిక్విడ్-కూల్డ్ సింక్రోనస్ మోటార్‌ను పొందుతుంది. గరిష్టంగా 42హెచ్‌పీ శక్తిని 62ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. మోటారు 8.9kWh బ్యాటరీతో వస్తుంది. బీఎండబ్ల్యూ సీఈ 04 క్లెయిమ్ చేసిన టాప్ స్పీడ్ గంటకు 120కిలోమీటర్ల రేంజ్ (ఎలక్ట్రానిక్‌గా లాక్), ప్రపంచ మోటార్‌సైకిల్ టెస్ట్ సైకిల్ (WMTC) పరిధి సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 130కిమీ ప్రయాణిస్తుంది. బీఎండబ్ల్యూ సీఈ 04తో పాటు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ, మినీ కూపర్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్‌లను ప్రవేశపెట్టనుంది.

Read Also : Ex-Rolls-Royce Designer : జర్మనీలో రోల్స్ రాయిస్ మాజీ హెడ్ డిజైనర్ దారుణ హత్య.. ఇయాన్ కామెరూన్ ఎవరంటే?

ట్రెండింగ్ వార్తలు