Mega – Allu Family : మెగా – అల్లు ఫ్యామిలీలు అంతా ఒక్కటే.. ఇవన్నీ తాత్కాలికం.. రూమర్లపై స్పందించిన నిర్మాత..

మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా మెగా వర్సెస్ అల్లు అభిమానులు హడావిడి చేశారు.

  • Published On : July 20, 2024 / 07:11 AM IST

Producer Bunny Vasu Reacts on Mega Allu Family Issue Regarding Pawan Kalyan and Allu Arjun

Mega – Allu Family : ఇటీవల ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఓ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసారు. ఈ నేపథ్యంలో మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా మెగా వర్సెస్ అల్లు అభిమానులు హడావిడి చేశారు.

తాజాగా ఆయ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో అల్లు ఫ్యామిలీకి సన్నిహితుడైన బన్నీ వాసు వీటిపై స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి మెగా – అల్లు వివాదం గురించి అడిగారు.

Also Read : Bunny Vasu : జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే నో చెప్పిన నిర్మాత.. కానీ వచ్చే ఎన్నికల్లో..

దీనికి నిర్మాత బన్నీ వాసు సమాధానమిస్తూ.. వాళ్ళ మధ్య, వాళ్ళ ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ ని నేనే 20 ఏళ్లుగా దగ్గర్నుంచి చూస్తున్నాను. చిరంజీవి గారు ఎప్పుడూ ఫ్యామిలీ అంతా కలిసే ఉండాలని కోరుకుంటారు. ప్రతి సంక్రాంతికి ఆయన ఫ్యామిలీ అంతా బెంగుళూరు తీసుకెళ్తారు. మేమంతా ఒక్కటే అని చెప్పడానికే ఆయన అలా చేస్తారు. పిల్లలు ఎదిగినా, ఎవరి ట్రాక్ లో వాళ్ళు ఉన్నా ఫ్యామిలీ అంతా ఒక్కటే, మేమంతా కలిసే ఉన్నాం అనే మెసేజ్ ని చిరంజీవి గారు బయటకి వెళ్లేలా చేస్తారు. కొంతమంది వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలిలో కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. అంత మాత్రాన తాత్కాలిక ఎమోషన్స్ ఆధారంగా ఫ్యామిలీలని లింక్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళ బాండింగ్ గురించి నాకు తెలుసు. వాళ్లలో ఎవరికి ఏమైనా మిగిలిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలుసు. ఇప్పుడున్న రూమర్స్ అన్ని చెక్ పెట్టడానికి ఒక్క సంఘటన చాలు. నేను కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నాను. ఆ ఫ్యామిలీలు బాగుండాలి, బాగుంటాయి కూడా. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే అని అన్నారు. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో మెగా – అల్లు అభిమానుల గొడవలు ఆగుతాయేమో చూడాలి.