Bunny Vasu : జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే నో చెప్పిన నిర్మాత.. కానీ వచ్చే ఎన్నికల్లో..

మెగా - అల్లు కాంపౌండ్ లోని నిర్మాత బన్నీ వాసు జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి కానీ చేయలేదు.

Bunny Vasu : జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే నో చెప్పిన నిర్మాత.. కానీ వచ్చే ఎన్నికల్లో..

Producer Bunny Vasu gives Clarity on Janasena MLA Ticket

Updated On : July 20, 2024 / 8:56 AM IST

Bunny Vasu : పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచే రాజకీయాల్లోకి వెళ్లడంతో సినీ పరిశ్రమ వ్యక్తులు చాలా మంది ఆయనకు సపోర్ట్ చేస్తారు. జనసేన తరపున చాలా మంది సినిమా వ్యక్తులు ఎన్నికల్లో ప్రచారం చేసారు. పలువురు నిర్మాతలు జనసేన పార్టీకి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసారు. అయితే మెగా – అల్లు కాంపౌండ్ లోని నిర్మాత బన్నీ వాసు జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి కానీ చేయలేదు.

Also Read : Trivikram – Allu Arjun : బన్నీ కోసం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్న త్రివిక్రమ్.. అసలు ఆట ఇప్పుడు మొదలు..

తాజాగా ఆయ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు మీడియాతో మాట్లాడగా ఓ మీడియా ప్రతినిధి దీని గురించి అడిగారు. దీంతో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. నాకు వెళ్లాలనే ఉంది. 2029 వరకు గీతా ఆర్ట్స్ ని కంప్లీట్ గా సెట్ చేసి అప్పుడు వెళ్ళు రాజకీయాల్లోకి, కావాలంటే నేను అప్పుడు డబ్బులు ఇస్తాను అని అల్లు అరవింద్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను 2019 లోనే పాలకొల్లు నుంచి పోటీ చేయమన్నారు. కానీ అప్పుడు నేను వద్దన్నాను, ఓడిపోయినా పర్లేదు చెయ్యి అన్నారు. కానీ నేనే భయపడి నో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో కూడా అడిగారు. అల్లు అరవింద్ గారిని అడిగి చెప్తాను అని చెప్పడంతో ఆయనకు అర్థమైంది. నాకు నేనుగా ఎప్పుడైతే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే అప్పుడు కలవమని పవన్ గారు చెప్పినట్టు తెలిపారు. దీంతో బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ బన్నీ వాసుకు జనసేన ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.