World’s Most Valuable Whisky : ప్రపంచంలో ఖరీదైన స్కాచ్ విస్కీ .. ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!

ఓ స్కాచ్ విస్కీ బాటిల్ వేలానికి సిద్ధమైంది. దీని ధర వింటే షాక్ అయ్యేలా ఉంది. విస్కీ ఎంత పురాతనమైనదైతే అంత ఖరీదు ఉంటుందనే విషయం తెలిసిందే. అటువంటిదే ఈ విస్కీ బాటిల్.

World most valuable whisky

World most valuable whisky Macallan Adani : ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ ‘సోథెబి’ మరో ఖరీదైన పదార్ధంతో వేలానికి సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో ఖరీదైన వస్తువుల వేలంతో తనకంటూ ఓ స్పెషాలిటీని కొనసాగిస్తున్న సోథెబి ఈసారి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘స్కాచ్ విస్కీ’ని వేలం వేసేందుకు రెడీ అయ్యింది. స్కాచ్ విస్కీని లండన్ లోని నవంబర్ 18 (2023)న వేలానికి సిద్ధం చేసింది. వేలంలో దీని ధర 1.2 మిలియన్ పౌండ్లు (1.4 డాలర్లు) అంటే భారతీయ కరెన్సీలో రూ.11కోట్లు పైనే పలుకుతుందని అంచనా వేస్తోంది సంస్థ.

కేవలం ఈ విస్కీ బాటిల్ కు ఇంత ధరా..? అని ఆశ్చర్యపోవచ్చు.కానీ సోధెబి లాంటి సంస్థ వేలం నిర్వహిస్తోంది అంటే దానికో రేంజ్, చరిత్ర ఉండే తీరుతుంది. ఈ స్కాచ్ విస్కీ 96 ఏళ్లనాటిది. సింగిల్ మల్ట్ మెకాల్లన్ అకాడమీ 1926 విస్కీ ఇది. ఈ స్కాచ్ విస్కీ వేలం గురించి సోథెబి స్పిరిట్స్ గ్లోబల్ హెడ్ జానీ ఫౌలే మాట్లాడుతు…ప్రతి ఒక్క వేలందారు దీన్ని విక్రయించాలనుకుంటారని అలాగే ప్రతీ కొనుగోలుదారుడు దీన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటారు’’ అని అన్నారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు నవంబర్ 1 నుంచే ముందస్తు బిడ్డింగ్ వేసుకోవచ్చు అని ప్రకటించారు.

కాగా.. 2019లోనూ మెకాల్లన్ అకాడమీ 1926 విస్కీ బాటిల్ ఒక దాన్ని వేలం వేయగా.. ఆనాడు 1.5 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు) పలికింది. అలాగే విస్కీ ఎంత పురాతనమైనదైతే అంత విలువ పెరుగుతుంటుంది. అలాగే ఎంత పురాతనమైనదైతే దాని రుచి అంత పెరుగుతుంది. అందుకే పురాతన విస్కీల ధరలు భారీగా ఉంటాయి. తాజాగా వేలానికి సిద్ధమవుతున్న ఈ స్కాచ్ విస్కీ 60 ఏళ్ల పాటు పీపాలలో మగ్గించి, 1986లో మెకాల్లన్ 1926 విస్కీని 40 బాటిళ్లు తయారు చేశారు. ఇప్పటి వరకు వీటిల్లో ఒకే బాటిల్ వినియోగించినట్టు సమాచారం. వీటిలో కొన్ని ది మకాలన్ క్లైంట్స్ అందిచబడ్డాయట.

ట్రెండింగ్ వార్తలు